News September 28, 2024

మహిళే ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు: సీఎం రేవంత్

image

TG: ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళే ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేస్తామని తెలిపారు. అక్టోబర్ 3 నుంచి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఒకే కార్డులో రేషన్, హెల్త్, ఇతర పథకాల వివరాలన్నీ ఉంటాయని, అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అర్హులను గుర్తిస్తామని చెప్పారు.

Similar News

News December 7, 2025

అన్నింటికీ ఆధారం ‘విష్ణుమూర్తి’

image

అజస్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాది రచ్యుతః।
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః॥
విష్ణుమూర్తికి పుట్టుక లేదు. ఆయనే అన్నింటికీ అధిపతి. ఏదైనా సాధించగలిగినవాడు. అన్నిటికంటే ముందుంటాడు. వానలు కురిపిస్తాడు. తిరిగి ఆ నీటిని స్వీకరిస్తాడు. ఆయన ఆత్మ అనంతం. కొలవడానికి వీలు కానిది. అన్ని లోకాల పరిణామం నుంచే ఈ సృష్టిని పుట్టించే శక్తి ఆయనకు ఉంది. అందుకే ఆయన అన్నింటికీ ఆధారం. <<-se>>#VISHNUSAHSARANAMAM<<>>

News December 7, 2025

విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయుల ధర్నా

image

TG: విద్యార్థి స్కూలుకు రాలేదని టీచర్లు ధర్నా చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో నాలుగో తరగతి స్టూడెంట్ వారం నుంచి స్కూలుకు రావట్లేదు. పేరెంట్స్‌ని అడిగితే సమాధానం లేదు. దాంతో ఆ ప్రాథమిక పాఠశాల టీచర్లు మిగిలిన విద్యార్థులతో కలిసి ఆ పిల్లాడి ఇంటి ముందు బైఠాయించారు. సోమవారం నుంచి పిల్లాడిని బడికి పంపుతామని పేరెంట్స్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

News December 7, 2025

ఆ లంబాడీలు ఎస్టీలు కాదు: హైకోర్టు

image

TG: 1956 తర్వాత మహారాష్ట్ర నుంచి వలస వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ లంబాడీలు ఎస్టీ క్యాటగిరీ కిందకు రాబోరని హైకోర్టు స్పష్టం చేసింది. తమ ఎస్టీ సర్టిఫికెట్‌ను రద్దు చేశారని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హాన్ దేవానంద్ కుటుంబం హైకోర్టుకు వెళ్లింది. 1950 నాటికి తెలంగాణలో నివసించే లంబాడీలు, వారి పూర్వీకులు, మహారాష్ట్ర నుంచి వచ్చిన లంబాడీలకు మాత్రమే ఎస్టీ క్యాటగిరీ వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.