News August 5, 2024
PF ఖాతాలో కుటుంబీకుల పేర్లు సవరించాలా?

పీఎఫ్ ఖాతాలో కీలక మార్పును చేయాలంటే ఎలా అన్నదానిపై EPFO కీలక సూచన చేసింది. తల్లిదండ్రులు, భాగస్వామి పేర్లను మార్చుకునేందుకు పాస్‌పోర్టు, రేషన్ కార్డు, CGHS/ECHS/మెడి క్లెయిమ్ కార్డు, పెన్షన్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్, ప్రభుత్వాలు జారీ చేసిన ఏదైనా ఫొటో ఐడీ కార్డు, ఆధార్, పాన్, టెన్త్/ఇంటర్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్‌లో కనీసం మూడింటిని సమర్పించాలని తెలిపింది.
Similar News
News March 3, 2026
క్రియేటర్లకు మద్దతుగా విజయసాయి ట్వీట్

సోషల్ మీడియా సంస్థలు క్రియేటర్ల కష్టాన్ని దోచుకుంటున్నాయని మాజీ MP విజయసాయి రెడ్డి ఆరోపించారు. యూట్యూబ్ ప్రకటనల ఆదాయంలో 55% ఇస్తుండగా, ఇన్‌స్టాగ్రామ్ రూపాయి కూడా ఇవ్వట్లేదని మండిపడ్డారు. మన క్రియేటర్లకు న్యాయమైన వాటా దక్కాలని, లేదంటే మన దేశానికే ‘భారత్ టాక్సీ’ తరహా సొంత ప్లాట్‌ఫామ్ ఉండాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. గతంలో క్రియేటర్లకు <<19248675>>మద్దతుగా<<>> అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు.
News March 3, 2026
భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది: పాక్ ప్రెసిడెంట్

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందంటూ పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన ఆరోపణలు చేశారు. ‘యుద్ధ క్షేత్రం నుంచి చర్చల టేబుల్ వద్దకు రండి’ అంటూ పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు అఫ్గాన్‌ను భారత్ అనుకూల దేశంగా అభివర్ణించారు. వారిని సైతం చర్చలకు రావాలని కోరారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గతంలో చేసిన మెరుపు దాడులతో పాక్ బెంబేలెత్తిపోయిన విషయం తెలిసిందే.
News March 3, 2026
ప్రపంచ యాత్రికుడు.. 24 ఏళ్ల వయసులోనే!

బిహార్‌కు చెందిన 24 ఏళ్ల కుర్రాడు నోమాడ్ శుభమ్ ప్రపంచ దేశాలను చుట్టేసి రికార్డు సృష్టించారు. మొత్తం 197 దేశాలను చుట్టేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు. అయితే విమానాల్లో ప్రయాణించకుండా కేవలం లిఫ్టులు, లోకల్ బస్సుల్లో వెళ్తూ ఈ ఘనత సాధించడం విశేషం. తన 16ఏళ్ల వయసులో మొదలైన ఈ సాహసయాత్ర 9ఏళ్ల పాటు కొనసాగి తాజాగా బ్రెజిల్‌లో ముగిసింది. సంకల్పం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని శుభమ్ నిరూపించాడు.


