News April 5, 2024

‘ఫ్యామిలీ స్టార్’ మూవీ REVIEW

image

ఉమ్మడి కుటుంబ బాధ్యతను మోసే మిడిల్ క్లాస్ యువకుడికి ఎదురయ్యే ఇబ్బందులే ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ కథ. విజయ్ దేవరకొండ, మృణాల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఫస్టాఫ్, కామెడీ, క్లైమాక్స్, కుటుంబ విలువలు తెలిపే సందేశాత్మక సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చుతాయి. బోరింగ్ సీన్లు, రొటీన్ స్టోరీ, సినిమా నిడివి, ట్విస్టులు లేకపోవడం మైనస్. మ్యూజిక్, స్క్రీన్‌ప్లేపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. RATING: 2.50/5.

Similar News

News November 25, 2025

VKB: పట్లోళ్ల రఘువీర్ రెడ్డికి డీసీసీ ఇస్తే.. నా పదవికి రాజీనామా చేస్తా!

image

పట్లోళ్ల రఘువీర్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి ఇస్తే.. తాను తన రాజ్యాంగబద్ధమైన పదవికి రాజీనామా చేస్తానని ఓ ప్రముఖ నాయకుడు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. రఘువీరా రెడ్డికి డీసీసీ పదవి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని ఆయన గట్టిగా సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ వర్గాల్లో ఈ అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

News November 25, 2025

కుల్దీప్ యాదవ్ @134

image

ఇదేంటి అనుకుంటున్నారా? దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో కుల్దీప్ యాదవ్ ఎదుర్కొన్న బంతుల సంఖ్య. 11 మందిలో 100 బంతులకు‌పైగా ఎదుర్కొన్నది ఆయనే కావడం గమనార్హం. 134 బంతులను ఎదుర్కొన్న కుల్దీప్ 19 పరుగులు చేశారు. జైస్వాల్ 58(97), సుందర్ 42(92) చేశారు. కాగా రెండో ఇన్నింగ్సులోనైనా వీలైనంత ఎక్కువ టైమ్ క్రీజులో ఉంటేనే భారత్ ఓటమి నుంచి తప్పించుకోవచ్చని ఫ్యాన్స్ అంటున్నారు.

News November 25, 2025

నవంబర్ 25: చరిత్రలో ఈరోజు

image

1926: 21వ సీజేఐ రంగనాథ్ మిశ్రా జననం
1964: వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు మరణం
1968: సినీ దర్శకుడు ముప్పలనేని శివ జననం
1972: సినీ నటి సుకన్య జననం
2010: ఒగ్గు కథ కళాకారుడు మిద్దె రాములు మరణం(ఫొటోలో)
2016: క్యూబా నాయకుడు ఫిడెల్ కాస్ట్రో మరణం
* అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినం