News April 25, 2024

ఎల్లుండి OTTలోకి ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా

image

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఏప్రిల్ 26 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఏప్రిల్ 5న విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

Similar News

News November 21, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 21, 2025

పైరసీ కట్టడికి ప్రత్యేక వింగ్?

image

TG: సినిమాల పైరసీ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇదే సమయంలో దానిపై ఉక్కుపాదం మోపేందుకు ఓ ప్రత్యేక వింగ్ పెట్టాలని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. పైరసీతో పాటు ఇతర సైబర్ నేరాల కట్టడికి ఇదే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఇప్పటికే పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు వివరించాయి. ఐ బొమ్మ రవి అరెస్టును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్న విషయం తెలిసిందే.

News November 21, 2025

నవంబర్ 21: చరిత్రలో ఈ రోజు

image

1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ల విడుదల
1970: శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్‌ మరణం (ఫొటోలో)
1987: నటి నేహా శర్మ జననం
2013: తెలుగు సినీ నిర్మాత వడ్డే రమేశ్ మరణం
☛ ప్రపంచ మత్స్య దినోత్సవం
☛ ప్రపంచ టెలివిజన్ దినోత్సవం