News April 5, 2024
‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ట్విటర్ రివ్యూ
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఓవర్సీస్లో ప్రీమియర్ షోలు పడటంతో సోషల్ మీడియాలో సినిమాపై నెటిజన్లు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. సినిమా చాలా బాగుందని, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో యావరేజ్‌గా ఉందని పోస్టులు పెడుతున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.
Similar News
News January 6, 2025
25 లక్షల కంటే ఎక్కువ జీతం పొందుతున్న వారు ఎంతమందో తెలుసా?
దేశంలో ఆదాయ పన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వారి జీతాలు ఇలా ఉన్నాయి. ఏడాదికి 5 లక్షల నుంచి 10 లక్షల జీతం ఉన్నవారు 1.28 కోట్ల మంది. 10L నుంచి 15L వరకు ఉన్నవారు 50 లక్షలు, 15L – 20L జీతం ఉన్నవారు 19L మంది, 20L – 25L వారు 9 లక్షలు, 25 L నుంచి 50 L జీతం పొందుతున్నవారు 13 లక్షల మంది ఉన్నారు. ఇంతకీ మీరు ఏ స్లాబ్‌లో ఉన్నారు
News January 6, 2025
చిక్కుల్లో నయనతార.. ‘చంద్రముఖి’ నిర్మాతల నోటీసులు
తన డాక్యుమెంటరీ విషయంలో స్టార్ హీరోయిన్ <<14626837>>నయనతారకు<<>> మరో సమస్య ఎదురైంది. చంద్రముఖి సినిమాలో కొన్ని క్లిప్పింగ్స్ తమ అనుమతి లేకుండా వాడారంటూ నిర్మాతలు నెట్‌ఫ్లిక్స్, నయన్‌కు నోటీసులు ఇచ్చారు. రూ.5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని అందులో పేర్కొన్నారు. ఇదే డాక్యుమెంటరీపై హీరో ధనుష్ కూడా రూ.10 కోట్లకు దావా వేసిన విషయం తెలిసిందే. తాజా నోటీసులపై ఆమె ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
News January 6, 2025
ఆలయాలకు స్వయం ప్రతిపత్తి.. మీ కామెంట్!
సనాతన ఎకానమీకి ఆలయాలే కేంద్ర బిందువులు. వాటి ఆధారంగానే రాఖీ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఎంత బిజినెస్ జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఈ ఆదాయం కోసమే మందిరాలను ప్రభుత్వాలు తమ పరిధిలోకి తీసుకున్నాయన్న విమర్శలున్నాయి. ఇకనైనా చెర విడిపించాలని, గుళ్లకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. మొన్న పవన్ కళ్యాణ్, నిన్న VHP హైందవ శంఖారావంలో వక్తలు దీనిపై గళమెత్తారు. మరి మీరేమంటారు?