News March 24, 2024

‘ఫ్యామిలీ స్టార్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

image

హీరో విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబినేషన్‍లో వస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుండగా ఈ నెల 28న ట్రైలర్‌ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన రాగా మూడో సాంగ్‌ను 25వ తేదీన విడుదల చేస్తామని తెలిపారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు.

Similar News

News April 7, 2026

కేరళం: LDF, UDF మధ్యలో NDA! 1/2

image

మరో 2 రోజుల్లో కేరళం అసెంబ్లీ ఎన్నికల <<19591221>>పోలింగ్<<>> జరగనుంది. విజయం కోసం అధికార LDF, కాంగ్రెస్ నేతృత్వంలోని UDF, బీజేపీ సారథ్యంలోని NDA సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. వాస్తవానికి ఇక్కడ LDF-UDF మధ్య ద్విముఖ పోరు నెలకొంది. ఈ రెండు పార్టీలు ఆధిపత్యం కోసం తహతహలాడుతున్నాయి. మరోవైపు BJP ఆత్మగౌరవ పోరాటం చేస్తోంది. సౌత్ ఇండియాలో పాగా వేసేందుకు ఆ పార్టీకి కేరళంలో అధికారం తప్పనిసరి.

News April 7, 2026

కేరళం: LDF, UDF మధ్యలో NDA! 2/2

image

లౌకికవాద భావాలు వేళ్లూనుకున్న కేరళంలో కాషాయ జెండా ఎగరడం అంత ఈజీ కాదు. 2011 ఎన్నికల నుంచి ఆ పార్టీ ఇప్పటివరకు ఒకే ఒక్క అసెంబ్లీ సీటు(2016) గెల్చుకోవడం గమనార్హం. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక లోక్‌సభ సీటును మాత్రమే దక్కించుకుంది. అయితే ఆ ఎన్నికల్లో 19.23% ఓటింగ్ నమోదు చేసి బలంగా కనిపించినా గత DECలో జరిగిన స్థానిక ఎలక్షన్స్‌లో అది 14.76శాతానికి పడిపోవడం పార్టీ శ్రేణుల ఆందోళనకు కారణమైంది.

News April 7, 2026

NTR ‘డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్?

image

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడినట్లు సమాచారం. ఇప్పటికే చిత్రీకరించిన సీన్లలో NTR లుక్‌పై డైరెక్టర్ సంతృప్తి చెందకపోవడంతో మరో లుక్‌ కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పాత్రకు తగ్గట్లుగా తారక్ తన బాడీ లాంగ్వేజ్, లుక్‌ను పూర్తిగా మార్చుకోనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ మూవీపై భారీ అంచనాలుండటంతో NTR లుక్‌పై జాగ్రత్త పడుతున్నారు.