News October 29, 2024
ఫ్యామిలీ విలన్ జగన్.. జస్టిస్ ఫర్ విజయమ్మ: TDP

AP: వైఎస్ జగన్ ఎంత సైకోనో ఆయన తల్లి విజయమ్మ రాసిన <<14483748>>లేఖలో<<>> స్పష్టమవుతోందని TDP వ్యాఖ్యానించింది. ‘కుటుంబ సభ్యులని జగన్ ఎలా వాడుకుని వదిలేస్తాడో, తండ్రి పరువు ఎలా తీస్తాడో, చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తులు ఎలా లాక్కుంటాడో చెప్తూ విజయమ్మ లేఖ రాశారు. రాజకీయ ముసుగులో ఇలాంటి వ్యక్తి సమాజంలో తిరగడం ఎంత ప్రమాదమో ప్రజలు తెలుసుకోవాలి’ అని ఫ్యామిలీ విలన్ జగన్, జస్టిస్ విజయమ్మ హ్యాష్‌ట్యాగ్స్‌తో ట్వీట్ చేసింది.
Similar News
News February 9, 2026
విశాఖ టు చెన్నై.. క్రూయిజ్‌షిప్ విహారానికి ఏర్పాట్లు

AP: ఈ ఏడాది కూడా విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వరకు లగ్జరీ క్రూయిజ్‌షిప్ విహారానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. జూన్ 24, జులై 1, 8, 15వ తేదీల్లో సర్వీసులు ఉంటాయి. రేట్లు, టైమింగ్స్‌పై విశాఖ పోర్టు అధికారులు కార్డిలియా క్రూయిజ్ ఎంవీ ఎంప్రెస్ యాజమాన్యంతో చర్చలు పూర్తిచేశారు. త్వరలోనే టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. కాగా ఈ 11 అంతస్తుల షిప్ ఇప్పటికే మూడుసార్లు విశాఖ నుంచి సేవలందించింది.
News February 9, 2026
నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్‌లో 47 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

బెంగళూరులోని CSIR-నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ 47 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. గ్రాడ్యుయేట్(BE, BTech), డిప్లొమా అర్హత గల వారు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ ట్రైనీలకు FEB 10న, డిప్లొమా ట్రైనీలకు FEB 11న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,300, డిప్లొమా ట్రైనీలకు రూ.10,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nal.res.in/
News February 9, 2026
జెమినీ, చాట్GPTకి దీటుగా మన ‘సర్వం ఏఐ’!

AI దిగ్గజాలు గూగుల్ జెమినీ, చాట్GPTలకు మన కంపెనీ సవాలు విసురుతోంది. బెంగళూరు స్టార్టప్ ‘సర్వం ఏఐ’ రిలీజ్ చేసిన Sarvam Vision, Bulbul టూల్స్ సంచలనం రేపుతున్నాయి. వర్డ్ అక్యూరసీలో 87.3%, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్(OCR)లో 84.3%, ఎర్రర్ రేటులో 8.6%తో జెమినీ, చాట్GPT, ఆంథ్రోపిక్ క్లౌడ్ కన్నా ఎంతో మెరుగైన ప్రదర్శనను కనబరిచాయి. ప్రస్తుతం ఇవి టెక్ నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాయి.


