News March 16, 2024
లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడికి జైలు శిక్ష

ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్న వెబ్‌సిరీస్‌లలో ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఇందులో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు ఓయోంగ్ సు(79)ను లైంగిక వేధింపుల కేసులో సౌత్ కొరియా పోలీసులు అరెస్టు చేశారు. 2017లో ఓ మహిళను లైంగికంగా వేధించినట్లు తేలడంతో కోర్టు 8 నెలల జైలు శిక్ష విధించింది. 40 గంటలపాటు లైంగిక వేధింపుల ట్రీట్మెంట్ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలని ఆదేశించింది.
Similar News
News August 27, 2025
4 టైటిల్స్.. అశ్విన్ IPL ప్రస్థానమిదే

IPLకు స్టార్ ప్లేయర్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2009లో CSK తరఫున ఎంట్రీ ఇచ్చి 2010, 2011లో ఆ జట్టు IPL టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. CSK తరఫునే 2010, 2014లో ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీస్ గెలిచారు. చెన్నై, RPS, పంజాబ్, DC, RR ఫ్రాంచైజీల్లో ఆడిన అశ్విన్ ఓవరాల్‌గా 221 మ్యాచ్‌ల్లో 187 వికెట్లు తీశారు. చెన్నైతోనే మొదలైన IPL ప్రయాణం ఈ ఏడాది అదే జట్టుతో ముగిసింది. <<17531363>>FAREWELL ASH<<>>
News August 27, 2025
వినాయకుడికి సీఎం రేవంత్ పూజలు

TG: వినాయక చవితి సందర్భంగా సీఎం రేవంత్ విఘ్నేశుడికి పూజలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి ఆయన పూజలు చేశారు. వేద పండితులు సీఎం కుటుంబసభ్యులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి గీత, కుమార్తె నైమిషా రెడ్డి దంపతులు, మనవడు రేయాన్ష్ పాల్గొన్నారు.
News August 27, 2025
SHOCKING: 17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల మహిళ

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన రేఖ(55) 17వ బిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాంశమైంది. చెత్త ఏరుతూ జీవనం సాగించే కావ్రా, రేఖ దంపతులకు 16 మంది పిల్లలు పుట్టగా వారిలో ఐదుగురికి పెళ్లై పిల్లలున్నారు. తాజాగా రేఖ మరోసారి ఆస్పత్రికి వెళ్లి నాలుగో ప్రసవమని అబద్ధం చెప్పింది. తర్వాత నిజం తెలిసి వైద్యులే షాకయ్యారు. ‘మాకు ఇల్లు లేదు. పిల్లలను చదివించలేకపోయా. తిండి కోసమే రోజూ కష్టపడుతున్నా’ అని కావ్రా అన్నారు.