News October 9, 2024
ప్రముఖ నటుడు కన్నుమూత

ప్రముఖ మలయాళ సీనియర్ నటుడు టీపీ మాధవన్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. తాజాగా ఆయన కొల్లంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చనిపోయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. బహుముఖ పాత్రలకు పేరుగాంచిన మాధవన్ 600కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన 2016లో విడుదలైన ‘మాల్గుడి డేస్’లో చివరగా నటించారు.
Similar News
News December 4, 2025
ఇంటర్వ్యూతో ICSILలో ఉద్యోగాలు

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(<
News December 4, 2025
పెప్లమ్ బ్లౌజ్‌ని ఇలా స్టైల్ చేసేయండి

సాధారణంగా పెప్లమ్ టాప్స్ జీన్స్‌పైకి సూట్ అవుతాయి. కానీ దీన్ని ఎత్నిక్ వేర్‌గా ట్రై చేస్తే మోడ్రన్ టచ్ ఇస్తుంది. పెప్లమ్ టాప్స్‌ను చీరలతో స్టైల్ చేసి ట్రెండీ లుక్ సొంతం చేసుకోవచ్చు. పార్టీల్లో, ఫంక్షన్లలో అందరి దృష్టిని ఆకర్షించాలంటే, జాకెట్ స్టైల్ పెప్లమ్ బ్లౌజ్‌తో చీరను మ్యాచ్ చేస్తే సరిపోతుంది. పెప్లమ్ బ్లౌజ్ వేసుకుంటే పల్లు లోపలికి తీసుకుంటారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
News December 4, 2025
‘అఖండ-2’ రిలీజ్ ఆపాలి: మద్రాస్ హైకోర్టు

‘అఖండ-2’ విడుదలను నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ‘అఖండ-2’ నిర్మాణ సంస్థ 14 రీల్స్(ఇప్పుడు 14 రీల్స్ ప్లస్) తమకు రూ.28 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో సమస్య పరిష్కారం అయ్యే వరకు 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన ‘అఖండ2’ విడుదల చేయొద్దని కోర్టు ఆదేశించింది. దీనిపై నిర్మాణ సంస్థ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.


