News February 10, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

మలయాళ నటుడు అజిత్ విజయన్(57) కన్నుమూశారు. తన నివాసంలో మరణించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒరు ఇండియన్ ప్రణయకథ, బెంగళూరు డేస్, అమర్ అక్బర్ అంథోని, అంజు సుందరికల్ తదితర సినిమాల్లో ఆయన నటించారు. ఆయన మృతిపై మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
Similar News
News April 10, 2026
75% అటెండెన్స్ లేకపోతే ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు!

TG: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హాజరు 75% లేకపోతే పరీక్షలకు అనుమతించొద్దని, స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు చేయనుంది. అలాగే ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతి రోజే దోస్త్ నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. కాలేజీలో చేరిన రోజే విద్యార్థులకు ఫ్రీ స్టడీ మెటీరియల్ అందించనున్నారు.
News April 10, 2026
‘హార్ముజ్’ వద్ద టోల్ వసూలు చేయవద్దు: ట్రంప్

‘హార్ముజ్’ వద్ద ఇరాన్ టోల్ వసూలు చేస్తోందన్న వార్తలపై ట్రంప్ స్పందించారు. ఒకవేళ ఫీజు వసూలు చేస్తుంటే వెంటనే ఆపేయాలని సూచించారు. ఇక ఇరాన్‌పై తాను ముందస్తు విజయం ప్రకటించుకున్నట్లు WSJ ప్రచురించడంపై ట్రంప్ మండిపడ్డారు. తాము విక్టరీ సాధించామని, ముందస్తు అనేదే లేదన్నారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండకుండా చేస్తానని చెప్పారు. ఆ దేశ సాయం లేకపోయినా త్వరలోనే ఆయిల్ యథావిధిగా సరఫరా అవుతుందన్నారు.
News April 10, 2026
వరుస ఫ్లాప్స్.. కృతి శెట్టి ఏమన్నారంటే?

సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఉప్పెన’తో హీరోయిన్‌గా లాంచ్ అయిన కృతిశెట్టి తన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటంపై స్పందించారు. బేబమ్మ లాంటి బలమైన పాత్ర తనకు మళ్లీ రాలేదని, అది ఒక లోటుగా మిగిలిపోయిందని చెప్పారు. సినిమాలు ఫెయిల్ అవుతున్నాయన్న బాధ కంటే బలమైన పాత్రలు దక్కలేదనే బాధే ఎక్కువగా ఉందని ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా ప్రమోషన్లలో వెల్లడించారు. త్వరలో ఆమె అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో నటించబోతున్నారు.


