News April 2, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

ప్రముఖ హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్(65) కన్నుమూశారు. కొద్దిరోజులుగా న్యుమోనియాతో ఆయన బాధపడుతున్నారని, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. ‘బ్యాట్‌మ్యాన్ ఫరెవర్(1995)’ సినిమాలో టైటిల్ రోల్‌తో కిల్మర్ ప్రసిద్ధి పొందారు. టాప్ గన్, టాప్ గన్: మావ్రిక్, విల్లో, ది డోర్స్, టాప్ సీక్రెట్ వంటి చిత్రాల్లో ఆయన నటించారు.
Similar News
News April 3, 2025
టారిఫ్స్ పెంచేందుకు కారణమిదే..

అమెరికా ప్రెసిడెంట్ టారిఫ్స్ పెంచడంతో ఆ దేశానికి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరగనున్నాయి. దీంతో విదేశీ కంపెనీలు అగ్రరాజ్యానికి వస్తువులను ఎగుమతి చేయడం తగ్గిస్తాయి. ఫలితంగా అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలు పెరుగుతాయి. అక్కడి వారికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయి. కొన్నేళ్ల వరకు ధరలు పెరిగినా ట్రంప్ నిర్ణయం దీర్ఘకాలంలో ఆ దేశానికి మేలు చేస్తుందని విశ్లేషకుల మాట.
News April 3, 2025
2026 T20WC వరకు టైట్ షెడ్యూల్

ఐపీఎల్ తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీ కానున్నారు. 2026 T20 WC వరకు టైట్ షెడ్యూల్ ఖరారైంది. జూన్-జులైలో ENGతో 5 టెస్టులు, SEPలో ఆసియా కప్, OCTలో వెస్టిండీస్‌తో 2 టెస్టులు, OCT-NOVలో AUSతో 3 ODI & 5 T20I, NOV-DECలో SAతో 2 Test, 3 ODI & 5 T20I, JANలో NZతో 3 ODI & 5 T20I, FEB-MARలో T20 వరల్డ్ కప్ ఆడనున్నారు.
News April 3, 2025
సంచలనం.. 25000 టీచర్ల పోస్టులు రద్దు

పశ్చిమ బెంగాల్లో టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. 2016లో జరిగిన 25 వేల టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను 2024లో కలకత్తా హైకోర్టు రద్దు చేయగా.. ఆ తీర్పును SC సమర్థించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవంది. 3 నెలల్లో కొత్త నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. కాగా, ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయని కొందరు కోర్టును ఆశ్రయించారు.