News March 26, 2025
ప్రముఖ నటి, మోడల్, డాన్సర్ హఠాన్మరణం

హాలీవుడ్ నటి, డాన్సర్, మోడల్ సిండ్యానా శాంటాంజెలో (58) మృతిచెందారు. మెడికల్ ఎమర్జెన్సీ కావడంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు. రీసెంటుగా ఆమె కాస్మొటిక్ ఇంజెక్షన్లు తీసుకున్నారు. వాటి దుష్ఫలితాల వల్లే బహుశా చనిపోయి ఉండొచ్చని కొందరు అనుమానిస్తున్నారు. ఒకేసారి మూడు MTV టాప్10 మ్యూజిక్ ఆల్బమ్స్లో నిలిచిన రికార్డు ఇప్పటికీ ఆమెదే కావడం విశేషం.
Similar News
News November 14, 2025
23వేల ఆధిక్యంలో నవీన్ యాదవ్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ లీడ్ భారీగా పెరుగుతోంది. 8వ రౌండ్ ముగిసేసరికి నవీన్ యాదవ్ 23వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరుసగా 8 రౌండ్లలో ఆయన లీడ్ సాధించడం విశేషం. మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి.
News November 14, 2025
ఆ భవనాలు IT Hub కోసం కాదు: అధికారులు

TG: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాలను ఐటీ హబ్ కోసం ఉపయోగిస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అధికారులు స్పందించారు. అవి తప్పుడు వార్తలని స్పష్టం చేశారు. అధునాతన ఆరోగ్య సేవలను అందించడానికి ప్రభుత్వం త్వరలో సనత్నగర్ TIMS, వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 14, 2025
రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ప్రశాంత్ కిశోర్.. జోరుగా చర్చ

బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ జన్ సురాజ్ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. 25 కంటే ఎక్కువ సీట్లను జేడీయూ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పీకే శపథం చేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం జేడీయూ 25 సీట్లను సునాయాసంగా గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ కిశోర్ ఒత్తిడి చేయడం వల్లే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసిందని జన్ సురాజ్ నేత అనుకృతి పేర్కొన్నారు.


