News October 22, 2025

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శివాలయాలు

image

కార్తీక మాసంలో శివాలయాలను సందర్శించడం శుభప్రదం. APలో నంద్యాల(D) శ్రీశైలం, మహానంది, యాగంటి తూ.గో(D) ద్రాక్షారామం, తిరుపతి(D) శ్రీకాళహస్తి, గుంటూరు(D) కోటప్పకొండ, అమరావతి అమరేశ్వర ఆలయం, ప.గో.(D) క్షీరారామం, భీమవరంలోని సోమారామ ఆలయాలు ప్రసిద్ధి. TGలోని సిరిసిల్ల(D) వేములవాడ రాజరాజేశ్వరుడు, సిద్దిపేట(D) మల్లన్న, భూపాలపల్లి(D) కాళేశ్వరం, వరంగల్(D) వెయ్యిస్తంభాల గుడి, రామప్ప ఆలయాలు ప్రసిద్ధి.

Similar News

News February 6, 2026

50ఏళ్ల తర్వాత మహిళలు ఇవి తినాలి

image

​ఆడవారిలో 50 సంవత్సరాలు దాటాక హార్మోనల్ చేంజెస్ వస్తాయి. దీంతో శక్తి తగ్గడం, జాయింట్ పెయిన్స్, కండరాలు దృఢంగా మారడం, మానసిక సమస్యలొస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే రోజూవారీ ఆహారంలో నువ్వులు, అవిసెగింజలు, బాదం పప్పులు తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు ఎక్కువగా నీరు తాగడంతో పాటు చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యడం మంచిదంటున్నారు.

News February 6, 2026

3,979 పోస్టులు.. అప్లై చేశారా?

image

యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో 3,979 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ITI, టెన్త్ అర్హత గలవారు మార్చి 3 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. మెరిట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టెన్త్ అభ్యర్థులకు నెలకు రూ.8200, ITI అభ్యర్థులకు రూ.9600 స్టైపెండ్ చెల్లిస్తారు. సైట్: recruit-gov.com/ *ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News February 6, 2026

ఇండియన్‌ టీచర్‌కు రూ.9 కోట్ల బహుమతి

image

ముంబైకి చెందిన టీచర్‌ రూబల్‌ నాగీకి ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌’ లభించింది. 10 లక్షల డాలర్లు (సుమారు రూ.9 కోట్లు) నగదు బహుమతితోపాటు అవార్డు దక్కింది. వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్-దుబాయ్‌లో దీనిని అందుకున్నారు. దేశవ్యాప్తంగా మురికివాడల్లో 800కి పైగా లెర్నింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి పేద పిల్లలకు విద్యను చేరువ చేశారు. గోడలపై చిత్రాలతో సబ్జెక్టులు బోధించి సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు.