News March 29, 2025

చెన్నై కెప్టెన్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం

image

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై ఆ టీమ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘మేము 50 పరుగుల తేడాతోనే ఓడిపోయాం. ఇదేమీ భారీ మార్జిన్ కాదు’ అని నిన్న గైక్వాడ్ అన్నారు. టీ20లో 50 రన్స్ తేడాతో ఓడిపోవడం అంటే భారీ కాదా? అని ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్ మైండ్‌సెటే ఇలా ఉంటే.. గెలవాలన్న కసి జట్టులోని మిగతా ప్లేయర్లకు ఎలా ఉంటుందని నిలదీస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News April 1, 2025

భార్యకు పెళ్లి చేసిన భర్త.. ఊహించని మలుపు

image

UP: భర్తే తన భార్యను ప్రియుడికిచ్చి <<15898025>>పెళ్లి చేసిన ఘటనలో<<>> సినిమా లెవల్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రియుడు వికాస్‌‌తో వెళ్లిపోయిన రాధిక మళ్లీ మొదటి భర్త బబ్లూ చెంతకు చేరింది. భార్యకు దూరమై పిల్లలిద్దరి బాధ్యత చూసుకుంటూ బబ్లూ అనుభవించే బాధ గురించి వికాస్ తల్లి తన కొడుక్కి అర్థమయ్యేలా చెప్పింది. దీంతో వికాస్ రాధికను తిరిగి బబ్లూ వద్దకు పంపాడు. తన భార్యను స్వీకరిస్తానని బబ్లూ పంచాయతీలో ఒప్పుకున్నాడు.

News April 1, 2025

CBG యూనిట్లతో 2.5 లక్షల మందికి ఉద్యోగాలు: టీడీపీ

image

AP: రాబోయే ఐదేళ్లలో రిలయన్స్ కంపెనీ రాష్ట్రవ్యాప్తంగా 500 కంప్రెస్డ్ బయోగ్యాస్(CBG) ప్లాంట్లను ఏర్పాటు చేయనుందని TDP వెల్లడించింది. రేపు కనిగిరిలో CBG యూనిట్‌కు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేస్తారని తెలిపింది. ‘ఈ ప్లాంట్లకు అనుబంధంగా ఎనర్జీ ప్లాంటేషన్ ద్వారా 5L ఎకరాల బంజరు భూమి ఉపయోగంలోకి వస్తుంది. దీనివల్ల 2.5L మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏటా 40L మె.టన్నుల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది’ అని పేర్కొంది.

News April 1, 2025

HCA, SRH ప్రతినిధుల భేటీ

image

కాంప్లిమెంటరీ పాస్‌ల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు HCA, సన్‌రైజర్స్ ప్రతినిధులు ఉప్పల్ స్టేడియంలో భేటీ అయ్యారు. ఒప్పందం ప్రకారం 10శాతం టికెట్లు కేటాయిస్తామని SRH చెప్పగా గతంలోలాగా అన్ని విభాగాల్లోనూ పాసులు కేటాయించాలని HCA కోరినట్లు తెలుస్తోంది. సన్‌రైజర్స్ సీఈఓ షణ్ముగంతో ఫోన్లో మాట్లాడిన అనంతరం జట్టు ప్రతినిధులు తమ నిర్ణయాల్ని అసోసియేషన్‌కు తెలిపారని సమాచారం.

error: Content is protected !!