News April 15, 2024
పాండ్యపై ఫ్యాన్స్ మండిపాటు

ఇప్పటికే కెప్టెన్సీ మార్పుతో పాండ్యపై MI ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. నిన్నటి మ్యాచ్ అనంతరం అది మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. పాండ్య బౌలింగ్‌లో 3ఓవర్లలోనే 43 పరుగులు సమర్పించుకున్నారు. అందులో చివరి ఓవర్లో ధోనీ కొట్టిన 3సిక్సులు కూడా ఉన్నాయి. ఇక భారీ స్కోరు ఛేజింగ్‌లో 6బంతులాడి కేవలం 2 పరుగులు చేశారు. కెప్టెన్సీపరంగానూ పలు తప్పులు చేశారు. ఇదే ఫ్యాన్స్ మండిపాటుకు కారణమవుతోంది.
Similar News
News April 10, 2026
అభిమానికి కొత్త ఫోన్ ఇచ్చిన సంజూ.. నెట్టింట ప్రశంసలు

రోడ్డుపై సెల్ఫీ అడిగిన ఫ్యాన్‌కు టీమ్ ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్ స్మార్ట్ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడంపై ప్రశంసలొస్తున్నాయి. కేరళంలోని పాలక్కాడ్ సమీపంలో కాల్ మాట్లాడేందుకు సంజూ కారును ఆపారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న శబరీష్ అనే యువకుడు సంజూను చూసి సెల్ఫీ అడిగాడు. అయితే శబరీష్ ఫోన్ డిస్‌ప్లే పాడయిందని గమనించిన సంజూ వెంటనే ఓ కొత్త ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.
News April 10, 2026
IPLలో నయా హిట్టర్.. సినిమా చూపించాడు!

KKRతో మ్యాచులో ఓడిపోతుందనుకున్న LSGకి యువ బ్యాటర్ ముకుల్ చౌదరి మరుపురాని <<19611824>>విజయాన్ని<<>> అందించారు. 16 ఓవర్ల తర్వాత LSG విజయానికి 24 బంతుల్లో 54 రన్స్ కావాలి. అప్పటికే మెయిన్ బ్యాటర్లందరూ ఔటవడంతో LSG ఓడిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ముకుల్ 2 ఫోర్లు, 7 సిక్సర్లతో విరుచుకుపడ్డారు. చివరి 4 ఓవర్లలో ఆయనొక్కరే 52 పరుగులు చేయడం గమనార్హం.
* మ్యాచ్ ఫొటో గ్యాలరీని పైన స్లైడ్ చేసి చూడండి.
News April 10, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


