News April 5, 2025

NTR లుక్‌పై అభిమానుల ఆందోళన!

image

యంగ్ టైగర్ NTR కొత్త లుక్‌పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘NTR-NEEL’ సినిమా కోసం ఆయన ఒక్కసారిగా బరువు తగ్గారు. ఎన్టీఆర్ అంటే కాస్త చబ్బీగా కండలు తిరిగిన బాడీతో ఉండాలని, ఇంత స్లిమ్‌ అవ్వడం ఏంటని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ లుక్ ఆయనకు సూట్ కాలేదని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే కొందరేమో స్లిమ్‌గా అదిరిపోయారు అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ లుక్ మీకెలా అనిపించింది? COMMENT

Similar News

News April 11, 2025

పోసానిపై అదనపు సెక్షన్లు.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం

image

AP: పోసాని కృష్ణమురళిపై కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనకు సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని తాము ఆదేశించిన తర్వాత సెక్షన్ 111(వ్యవస్థీకృత నేరం) చేర్చడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని సూళ్లూరుపేట CIకి నోటీసులిచ్చింది. కాగా TTD ఛైర్మన్‌ను దూషించారంటూ TV5 సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదైంది.

News April 11, 2025

సొంత గ్రౌండులో ఆర్సీబీ చెత్త రికార్డు

image

ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన ఆర్సీబీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఒకే వేదిక(బెంగళూరు-చిన్నస్వామి స్టేడియం)లో అత్యధిక సార్లు(45) ఓడిన జట్టుగా నిలిచింది. భారీ సపోర్ట్ ఉండే హోమ్ గ్రౌండులోనే ఇలా ఓటములు ఎదురవడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో DC(44), KKR(38), MI(34), PBKS(30) ఉన్నాయి. ఈ జట్లు కూడా తమ సొంత గ్రౌండ్లలోనే ఎక్కువసార్లు ఓడిపోవడం గమనార్హం.

News April 11, 2025

ప్రపంచంలో అత్యధిక టీబీ కేసులు భారత్‌లోనే: పరిశోధకులు

image

ప్రపంచంలోనే అత్యధిక క్షయ కేసులు భారత్‌లోనే నమోదవుతున్నాయని పలువురు పరిశోధకులు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. క్షయపై చర్చించేందుకు హైదరాబాద్‌లో ప్రారంభమైన సదస్సులో వారు మాట్లాడారు. ‘క్షయ కారణంగా 2023లో 3 లక్షలమందికి పైగా కన్నుమూశారు. ముందే గుర్తిస్తే టీబీ మరణాన్ని అరికట్టొచ్చు. భారత్‌కు సవాలుగా మారిన దీనిపై అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!