News April 21, 2024
రిషభ్ పంత్‌పై ఫ్యాన్స్‌లో ఆందోళన

SRHపై మ్యాచ్‌లో రిషభ్ పంత్ ప్రదర్శన పట్ల టీమ్ ఇండియా అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అతడి ఆటతీరు మునుపటిలా లేకపోవడమే ఇందుక్కారణం. ఫిట్‌నెస్ పరంగానూ మోకాలి గాయం నుంచి ఇంకా కోలుకున్నట్లు కనిపించడం లేదంటున్నారు. పలు షాట్లు ఆడినప్పుడు పంత్ కింద పడిపోతుండటం గమనార్హం. రానున్న టీ20 వరల్డ్ కప్‌నకు అతడిని సెలక్ట్ చేస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో పంత్ ఎలా ఆడతారోనంటూ నెట్టింట చర్చ నడుస్తోంది.
Similar News
News January 30, 2026
MMRCLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News January 30, 2026
ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయాలు ఇవే

1.కింగ్ ఫాద్ (దమ్మామ్, సౌదీ): 776 చ.కి.మీ విస్తీర్ణం. ముంబై సిటీ కంటే పెద్దది.
2.డెన్వర్ (అమెరికా): 137.8 చ.కి.మీ. 16వేల అడుగుల పొడవైన రన్ వే ఉంటుంది.
3.కౌలాలంపూర్ (మలేషియా): 100 చ.కి.మీ. ‘ఎయిర్‌పోర్ట్ ఇన్ ది ఫారెస్ట్’ అని పిలుస్తారు. ప్రపంచంలో అతి ఎత్తైన ATC (133.8 మీటర్లు) ఇక్కడే ఉంది.
4.ఇస్తాంబుల్ (తుర్కియే): 76.5 చ.కి.మీ.
5.డల్లాస్ (అమెరికా): 69.7 చ.KM.
>టాప్-10లో భారత విమానాశ్రయాలు లేవు.
News January 30, 2026
బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్?

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొవిడ్ సమయంలో నిలిపివేసిన రైల్వే ప్రయాణ రాయితీలను తిరిగి అమలు చేయాలనే ప్రతిపాదనపై కేంద్ర ఆర్థిక, రైల్వే మంత్రిత్వ శాఖలు చర్చలు జరుపుతున్నాయి. దీనికి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆరేళ్ల తర్వాత వృద్ధులు తక్కువ ఛార్జీలతో రైలు ప్రయాణం చేయనున్నారు. గతంలో పురుషులకు 40%, మహిళలకు 50% రాయితీ ఉండేది.


