News July 8, 2024

అభిమాని హత్యకేసు.. వేలిముద్రలు వారిద్దరివే!

image

అభిమాని రేణుకాస్వామి <<13484886>>హత్య<<>> కేసులో సేకరించిన వేలి ముద్రలు దర్శన్, పవిత్రాగౌడవే అని నివేదికల్లో తేలింది. ఘటనా స్థలం, మృతదేహాన్ని తరలించిన వాహనంలో వేలి ముద్రలను బెంగళూరు, హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ కేంద్రాలకు పంపి పరీక్షించారు. ఈ కేసులో అరెస్టయిన 17 మందిపై వేర్వేరు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు దర్శన్, పవిత్ర బెయిల్‌కు ప్రయత్నిస్తే అభ్యంతరం చెబుతామని సిట్ అధికారులు తెలిపారు.

Similar News

News October 21, 2025

ట్రంపే కాదు.. ఆయన సెక్రటరీ అంతే!

image

US ప్రెసిడెంట్ ట్రంప్ నోటి దురుసు గురించి తెలిసిందే. ఈ విషయంలో తానేం తక్కువ కాదని వైట్‌హౌస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ నిరూపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించేందుకు త్వరలో ట్రంప్, పుతిన్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో భేటీ కానున్నారు. ఈ హై‌లెవెల్ సమ్మిట్‌కు ఆ లొకేషన్ ఎవరు ఎంపిక చేశారని ఓ జర్నలిస్ట్ కరోలిన్‌కు మెసేజ్ చేశారు. ‘మీ అమ్మ చేసింది’ అని ఆమె బదులివ్వడంతో విమర్శలు వెల్లువెత్తాయి.

News October 21, 2025

H-1B వీసా ఫీజు.. విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్

image

అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. USలో చదువుతున్న వారికి హెచ్-1బీ వీసా ఫీజు నుంచి సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ మినహాయింపు కల్పించింది. అమెరికా బయటి నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే లక్ష డాలర్లు చెల్లించాలని స్పష్టం చేసింది.

News October 21, 2025

నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

image

రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా AP CM చంద్రబాబు నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దుబాయ్, అబుదాబి, UAEలలో 3 రోజులు పర్యటిస్తారు. వచ్చేనెల విశాఖలో జరిగే CII సదస్సుకు రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్, రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ వంటి రంగాలకు చెందిన వ్యాపారవేత్తలను ఆయన ఆహ్వానించనున్నారు. CM వెంట మంత్రులు TG భరత్, జనార్దన్ రెడ్డి, పలువురు అధికారులు వెళ్లనున్నారు.