News February 1, 2025

ఫ్యాన్స్ ప్రతి రూపాయికి న్యాయం చేస్తా: హార్దిక్

image

తాను ఎప్పుడూ అభిమానులను ఎంటర్టైన్ చేయడానికే ప్రయత్నిస్తానని టీమ్ ఇండియా ప్లేయర్ హార్దిక్ పాండ్య అన్నారు. అభిమానులు టికెట్ కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి న్యాయం చేస్తానని చెప్పారు. ‘ప్రతి క్షణం ఆట కోసమే పరితపిస్తా. ఆట నాకు ఎన్నో తిరిగిచ్చింది. క్రికెటే నా జీవితం. నా తొలి ప్రేమ కూడా అదే. తొలి ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే’ అని పేర్కొన్నారు. ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో హార్దిక్ 53 రన్స్ బాదారు.

Similar News

News March 12, 2025

పాకిస్థాన్ క్రికెట్ ICUలో ఉంది: అఫ్రీది

image

సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే పాకిస్థాన్ క్రికెట్ ఇప్పుడు ICUలో ఉందని మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది అన్నారు. ‘PCB నిర్ణయాల్లో కంటిన్యుటీ, కన్సిస్టెన్సీ ఉండట్లేదు. తరచుగా కెప్టెన్, కోచ్‌లను మారుస్తున్నారు. కోచ్‌లు ప్లేయర్లను నిందించడం, మేనేజ్‌మెంట్ స్టాఫ్ తమ పదవుల్ని కాపాడుకునేందుకు కోచ్‌లు, ఆటగాళ్లను నిందించడం విచారకరం’ అని బోర్డు పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

News March 12, 2025

వచ్చే నెల అమరావతికి ప్రధాని మోదీ!

image

AP: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో రాజధాని అమరావతి పనులను పున:ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించగా ఆయన అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ప్రధాని కార్యాలయం అమరావతి పర్యటన తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, రాజధాని పనులను అట్టహాసంగా మళ్లీ స్టార్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 9ఏళ్ల కిందట అమరావతి పనులకు మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

News March 12, 2025

ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్

image

AP: ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వేతన బకాయిలను మరో 2 రోజుల్లో విడుదల చేయనున్నట్లు వివరించింది. అలాగే, మెటీరియల్ నిధులతో చేపట్టిన పనుల పెండింగ్ బిల్లులనూ 10 రోజుల్లో చెల్లిస్తామంది. ఈ రెండింటికీ సంబంధించి రూ.2వేల కోట్ల బకాయిలు ఉండటంతో రాష్ట్ర ఉన్నతాధికారి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఉన్నతాధికారులను కలిశారు. దీంతో సానుకూలంగా స్పందించిన వారు నిధులు విడుదల చేస్తామని చెప్పారు.

error: Content is protected !!