News October 14, 2024

స్పెషల్ బస్సుల్లోనే ధరలు పెంచాం: సజ్జనార్

image

బస్సు ఛార్జీలు పెంచినట్లు వస్తోన్న వార్తల్లో వాస్తవం లేదని TGSRTC ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. 2003లో జీవో- 16 ప్రకారం స్పెషల్ బస్సులకు మాత్రమే ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. ‘రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌ల టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదు. ర‌ద్దీకి అనుగుణంగా ప్ర‌తి రోజు 500 స్పెష‌ల్ బ‌స్సులను సంస్థ న‌డుపుతోంది. వీటిలో మాత్రమే ఛార్జీలు పెంచాం. మిగతా రోజుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయి’ అని స్పష్టం చేశారు.

Similar News

News October 14, 2024

ఎల్లుండి బ్రేక్ దర్శనాలు రద్దు: TTD

image

తిరుమలలో ఈ నెల 16న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. రాగల 48 గంటల్లో భారీ వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ అంచనాలతో భక్తుల భద్రత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 15న సిఫార్సు లేఖలను స్వీకరించబోమని వెల్లడించింది.

News October 14, 2024

‘INDIA’ కోసం రంగంలోకి సునీల్ క‌నుగోలు

image

మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో INDIA కూట‌మి గెలుపు కోసం వ్యూహకర్త సునీల్ క‌నుగోలు రంగంలోకి దిగారు. హ‌రియాణాలో జాట్ల ఓట్ల స‌మీక‌ర‌ణ క్ర‌మంలో మిగతా వ‌ర్గాలు దూర‌మ‌వ్వ‌డం కాంగ్రెస్ కొంపముంచింది. దీంతో MHలో అందరికీ స‌మ ప్రాధాన్యం ఇవ్వడం సహా, అసంతృప్తి నేత‌ల‌ను మ‌చ్చిక చేసుకొనే వ్యూహాలను పార్టీ ముందుంచినట్టు తెలిసింది. హరియాణాలో కాంగ్రెస్ రెబల్స్‌కు BJP సహకరించడం వల్లే ఓడిపోయామని కాంగ్రెస్ భావిస్తోంది.

News October 14, 2024

సంగీతంతో మొక్కలు వేగంగా పెరుగుతాయ్!

image

సంగీతానికి రాళ్లు కరిగించే శక్తి ఉంటుందంటారు. అదే సంగీతం మొక్కలను వేగంగా పెరిగేలా చేస్తుందనే విషయాన్ని పరిశోధకులు నిరూపించారు. మ్యూజిక్ ప్లే చేయడం ద్వారా మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే ఫంగస్‌ కార్యాచరణను ప్రేరేపించవచ్చని తేలింది. శిలీంధ్రాలున్న పాత్రల చుట్టూ సౌండ్ బూత్‌లను అమర్చి పరీక్షించారు. 5 రోజుల తర్వాత శిలీంధ్రాలలో పెరుగుదల& బీజాంశం ఉత్పత్తిలో వేగం కనిపించింది.