News October 28, 2024
ఫామ్ హౌస్ పార్టీ.. హైకోర్టు కీలక ఆదేశాలు

TG: ఫామ్ హౌస్ పార్టీ కేసులో రాజ్ పాకాలను పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు హైకోర్టు 2 రోజులు సమయం ఇచ్చింది. కాగా KTR బావమరిది అనే కారణంతోనే రాజ్‌ను టార్గెట్ చేశారని ఆయన తరుఫున న్యాయవాది మయూర్ రెడ్డి అన్నారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మరోవైపు ఈ కేసులో ఎవ్వరిని అరెస్టు చేయలేదని AAG ఇమ్రాన్ కోర్టుకు తెలిపారు. నిబంధనల ప్రకారమే నోటీసులు ఇచ్చామన్నారు.
Similar News
News November 10, 2025
అందెశ్రీ మృతిపై కేసీఆర్, కిషన్ రెడ్డి, సంజయ్ సంతాపం

ప్రజాకవి అందెశ్రీ మరణం పట్ల మాజీ సీఎం KCR, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో కవిగా తన పాటలు, సాహిత్యంతో కీలకపాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని KCR అన్నారు. ఉద్యమ కాలంలో ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆకాంక్షించారు.
News November 10, 2025
పచ్చిపాలతో ముఖానికి మెరుపు

పాలతో ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..* 2చెంచాల పచ్చిపాలు, చెంచా తేనె కలిపి ఆ పేస్ట్‌ను కాటన్ బాల్స్‌తో ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. * కొద్దిగా పచ్చిపాలు, సగం అరటి పండు వేసి మెత్తగా కలపాలి. ఆ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి 20నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం మెరుపులీనుతుంది.
News November 10, 2025
రాహుల్ గాంధీకి పనిష్మెంట్.. 10 పుష్ అప్స్

మధ్యప్రదేశ్‌లోని పచ్మర్హిలో జరిగిన INC సమావేశానికి అగ్రనేత రాహుల్ గాంధీ 20ని.లు ఆలస్యంగా వెళ్లారు. లేటుగా వచ్చిన వాళ్లు పనిష్మెంట్ను ఎదుర్కోవాలని ఆ ప్రోగ్రామ్ చీఫ్ సచిన్ రావు సరదాగా చెప్పారు. దీంతో ఆయన సూచన మేరకు రాహుల్ 10 పుష్ అప్స్ తీసిన తర్వాత కుర్చీలో కూర్చున్నారు. దీంతో అక్కడున్నవారు చప్పట్లతో అభినందించారు. కాగా రాహుల్ గతంలోనూ పలు కార్యక్రమాల్లో పుష్ అప్స్ చేసి కార్యకర్తల్లో జోష్ నింపారు.


