News January 7, 2025

కోటి ఎకరాలకు ‘రైతు భరోసా’?

image

TG: ఈనెల 26 నుంచి ‘రైతు భరోసా’ సాయాన్ని పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. యాసంగి సీజన్‌కు సంబంధించి ఎకరానికి ₹6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. సాగు భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇస్తున్న నేపథ్యంలో దాదాపు కోటి ఎకరాలకు ఈ పథకం అమలయ్యే అవకాశం ఉంది. అంటే ₹5,500 కోట్ల నుంచి ₹6,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. గత ప్రభుత్వం 1.52 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయాన్ని అందించింది.

Similar News

News January 8, 2025

కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత: జగన్

image

AP: కార్యకర్తలను వేధించిన వారిని చట్టం ముందు నిలబెడతామని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కార్యకర్తలను ఇప్పటివరకు ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూసుకుంటామని చెప్పారు. జెండా మోసిన వారందరికీ భరోసాగా ఉంటామన్నారు. ఇవాళ తాడేపల్లిలో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకత రావడానికి కనీసం ఏడాదైనా పడుతుందని కానీ ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోందన్నారు.

News January 8, 2025

రూ.2,600 కోట్లతో గ్రామీణ రోడ్ల నిర్మాణం: మంత్రి

image

TG: సీఎం ఆదేశాలతో రూ.2,600 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. కొత్త రహదారుల నిర్మాణ అంచనాలు పక్కాగా ఉండాలని, ఇష్టారీతిన అంచనాలను సవరించొద్దని స్పష్టం చేశారు. పనులు సరిగా చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని, నాసిరకం పనులకు ఎన్ఓసిలిచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహానగరాల్లో రోడ్లు మెరిసినట్టుగానే పల్లెల్లోనూ రహదారులు మెరవాలన్నారు.

News January 8, 2025

RSSపై ప్రేమవల్లే ప్రణబ్‌కు స్మారకం: కాంగ్రెస్ MP

image

మన్మోహన్‌ను పట్టించుకోకుండా రాజ్‌ఘాట్లో ప్రణబ్‌ముఖర్జీకి స్మారకం నిర్మించడం BJP డర్టీ పాలిటిక్స్‌కు నిదర్శనమని కాంగ్రెస్ MP డానిష్ అలీ విమర్శించారు. ఇది దేశ‌ ఎకానమీని సంస్కరించిన MMSను అవమానించడమేనని అన్నారు. సంఘ్‌పై ప్రేమ వల్లే ప్రణ‌బ్‌కు స్మారకం నిర్మిస్తున్నారని ఆరోపించారు. RSS ఫౌండర్‌ హెగ్డేవార్‌ను ఆయన ‘ధర్తీపుత్ర’గా కీర్తించారని, సావర్కర్ చిత్రాన్ని పార్లమెంటులో పెట్టించారని విమర్శించారు.