News May 26, 2024
జులైలో రైతు భరోసా డబ్బులు: మంత్రి తుమ్మల

TG: వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేస్తున్న రైతులకు ‘రైతు భరోసా’ అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. జులైలో ఎకరానికి ₹7,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. రైతుల నుంచి అఫిడవిట్ తీసుకుంటేనే కౌలుదార్లకు భరోసా సాయం అందుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 15లోపు ₹2లక్షల రుణమాఫీ కచ్చితంగా చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామన్నారు.
Similar News
News December 10, 2025
వికారాబాద్: 225 జీపీల్లో రేపే పోలింగ్

నిన్నటితో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. వికారాబాద్ జిల్లాలో తొలి విడతలో 37 గ్రామాలు ఏకగ్రీవం కాగా 225 సర్పంచ్, 1,912 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 1,100 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయగా 51 సమస్యాత్మక గ్రామాలకు గుర్తించినట్లు ఎస్పీ స్నేహమెహ్ర తెలిపారు. రెండో దశ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మూడో విడతలో పోటీలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలడంతో ప్రచార పర్వం మొదలైంది.
News December 10, 2025
తిరుమల శ్రీవారి చెంత బయటపడ్డ మరో స్కాం

కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరుడిని మోసం చేసిన మరో స్కాం బయటకొచ్చింది. వేద ఆశీర్వచనం పొందే ప్రముఖులకు ఇచ్చే పట్టువస్త్రాల (సారిగ దుపట్టా) కొనుగోలులో భారీ మోసం, అక్రమాలు జరిగినట్లు TTD విజిలెన్స్ గుర్తించింది. నగరికి చెందిన VRS ఎక్స్పోర్ట్స్ ₹100 విలువ చేయని పాలిస్టర్ క్లాత్ను పట్టు అని ₹1400కు సరఫరా చేసినట్లు బోర్డుకు తెలిపింది. 2015-25 మధ్య ఇలా శ్రీవారి ఖజానా నుంచి ₹54 కోట్లు దోచుకుంది.
News December 10, 2025
రేపటి నుంచి భవానీ దీక్షల విరమణ

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ప్రారంభంకానున్న భవానీ మండల దీక్ష విరమణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి 7 లక్షల మంది భవానీలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గిరి ప్రదక్షిణ కోసం 9 కి.మీ. మార్గాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేశారు. భవానీల కోసం 3 హోమగుండాలు, నిత్య అన్నదానం, రైల్వే స్టేషన్- బస్ స్టాండ్ల నుంచి బస్సులు ఏర్పాటు చేశారు.


