News November 7, 2024

రైతు బాంధవుడు ఎన్జీ రంగా (1/2)

image

రైతుల బాధలపై పార్లమెంట్‌లో బలమైన గొంతుక వినిపించిన గొప్ప నేత గోగినేని రంగారావు(NG రంగా). గుంటూరు(D) నిడుబ్రోలులో 1900 NOV 7న జన్మించారు. రైతు ఉద్యమాలను స్వాతంత్ర్య పోరాటంలో భాగం చేశారు. జమిందారీ విధానానికి ఎదురొడ్డి నిలిచారు. నీతివంతంగా, నిరాడంబరంగా జీవించిన ఆయన పదవులకు ఏనాడూ ఆశ పడలేదు. 1952లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర పార్టీ స్థాపించారు. 1997లో వ్యవసాయ కాలేజీకి NG రంగా పేరు పెట్టారు.

Similar News

News November 23, 2025

రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్‌గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.

News November 23, 2025

మొక్కజొన్న, వేరుశనగలో బోరాన్ లోప లక్షణాలు

image

☛ మొక్కజొన్న: లేత ఆకుల పరిమాణం తగ్గి హరిత వర్ణాన్ని కోల్పోతాయి. జల్లు చిన్నవిగా ఉండి మొక్క నుంచి బయటికి రావు. బోరాన్ లోప తీవ్రత అధికంగా ఉంటే కండెలపై గింజలు వంకర్లు తిరిగి చివరి వరకు విస్తరించవు. దీని వల్ల దిగుబడి, సరైన ధర తగ్గదు. ☛ వేరుశనగ: లేత ఆకులు పసుపు రంగులోకి మారి దళసరిగా కనిపిస్తాయి. బీజం నుంచి మొలకెత్తే లేత ఆకు కుచించుకొని రంగు మారుతుంది.

News November 23, 2025

సామ్ కరన్ ఎంగేజ్‌మెంట్

image

ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరన్ తన ప్రియురాలు ఇసాబెల్లా గ్రేస్‌ను పరిచయం చేశారు. ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేస్తూ, ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. వీరు తొలిసారిగా 2018లో పరిచయమయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇసాబెల్లా 1998న ఇంగ్లండ్‌లో జన్మించారు. థియేటర్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. అటు సామ్ కరన్ వచ్చే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నారు.