News July 31, 2024

కాంగ్రెస్ హయాంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి: పల్లా

image

TG: కాంగ్రెస్ వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగాయని BRS MLA పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. వాటిపై మంత్రులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వరి విస్తీర్ణంలో 2014లో 14వ స్థానంలో ఉన్న తెలంగాణను మా హయాంలో నంబర్ వన్ చేశాం. వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు కేవలం సన్నాలకు మాత్రమే ఇస్తామంటోంది. రుణమాఫీకి రూ.41 వేల కోట్లని చెప్పి బడ్జెట్‌లో రూ.25వేల కోట్లు పెట్టింది’ అని మండిపడ్డారు.

Similar News

News March 20, 2026

నేడే రాష్ట్ర బడ్జెట్

image

TG: 2026-27 రాష్ట్ర బడ్జెట్‌కు వేళయింది. ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీలో DyCM భట్టి, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఉదయం అసెంబ్లీ కమిటీ హాలులో క్యాబినెట్ సమావేశమై బడ్జెట్‌ను ఆమోదించనుంది. ఈ ఏడాది బడ్జెట్ ₹3.36 లక్షల కోట్లుగా ఉండనుందని తెలుస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యం ఉంటుందని, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ₹29 వేల కోట్లు కేటాయించవచ్చని సమాచారం.

News March 20, 2026

భారీ ఆఫర్‌ను తిరస్కరించిన రాజస్థాన్ రాయల్స్?

image

IPL జట్టు రాజస్థాన్ రాయల్స్‌ భారీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. కొలంబియా పసిఫిక్ క్యాపిటల్ పార్ట్‌నర్స్(CPCP) కన్సార్షియం వేసిన $1.7 బిలియన్ల(₹16 వేల కోట్లు) బిడ్‌ను ఫ్రాంచైజీ అంగీకరించలేదని NDTV తెలిపింది. మరింత వాల్యుయేషన్ కోసమే RR ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. RCBని కొనుగోలు చేసేందుకు స్వీడన్‌ కంపెనీ ‘ఈక్యూటీ(EQT)’ ₹18,486 కోట్లకు బిడ్ దాఖలు చేసినట్లు <<19422000>>వార్తలు రావడం<<>> తెలిసిందే.

News March 20, 2026

మరో వివాదంలో పైలట్ రోహిత్ రెడ్డి!

image

TG: డ్రగ్స్ కేసులో <<19404520>>అరెస్టయిన<<>> Ex MLA పైలట్ రోహిత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మొయినాబాద్‌లోని ఆయన ఫామ్‌హౌస్ అసైన్డ్ భూమిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. జంగయ్య అనే వ్యక్తి పేరుతో ల్యాండ్ ఉందని సమాచారం. దీంతో ఆ భూమి రోహిత్ రెడ్డి చేతికి ఎలా వెళ్లిందనేది తెలుసుకుంటామని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అవసరమైతే ఫామ్‌హౌస్‌ను సీజ్ చేస్తామంటున్నారు.