News January 3, 2025
రైతులు, విద్యార్థులకు రూ.23,112 కోట్లు నష్టం: వైసీపీ

AP: సీఎం చంద్రబాబును నమ్మడం, నక్కను నమ్మడం ఒకటేనని మరోసారి నిజమైందని వైసీపీ Xలో విమర్శించింది. ‘ఘరానా దొంగ CBN రైతులను దర్జాగా మోసం చేశారు. రైతు భరోసాకు రిక్త హస్తం చూపారు. దీంతో 54 లక్షల మందికి ఏటా రూ.20వేల చొప్పున అందకపోవడంతో రూ.10,000 కోట్లు నష్టపోయారు. తల్లికి వందనం పథకంలో భాగంగా 87.42 లక్షల మంది విద్యార్థులకు రూ.15వేల చొప్పున అందకపోవడంతో రూ.13,112 కోట్లు నష్టపోయారు’ అని ఆరోపించింది.
Similar News
News November 20, 2025
పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సహకంపై దృష్టి పెట్టండి: కలెక్టర్

జిల్లాలో పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహంపై దృష్టి సాధించాలని కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నిర్వహించారు. పరిశ్రమల విస్తరణ, ఎగుమతుల పెంపు, స్థానిక ఉత్పత్తులకు మరింత మార్కెట్ కల్పించే చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ఎగుమతుల అవకాశాలు గుర్తించి సమస్యను పరిష్కరించాలని సూచించారు.
News November 20, 2025
ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.
News November 20, 2025
త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.


