News September 10, 2025
‘అర్క’ టమాటతో రైతుకు భరోసా

టమాటను ఆకుముడత, వడలు తెగులు, ఆకు మాడు తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. వీటి కట్టడికి IIHA బెంగళూరు ‘అర్కరక్షక్’, ‘అర్క సామ్రాట్’, ‘అర్క అబేద్’ హైబ్రిడ్ రకాలను తీసుకొచ్చింది. ‘అర్క రక్షక్’, ‘అర్కసామ్రాట్’లు ఆకుముడత, వైరస్, వడలు తెగులు, తొలి దశలో ఆకుమచ్చ, మాడు తెగుళ్లను తట్టుకొని 140 రోజులలో ఎకరాకు 30-34 టన్నుల దిగుబడినిస్తాయి. ‘అర్క అబేద్’ 140-150 రోజుల్లో 30-32 టన్నుల దిగుబడినిస్తుంది.
Similar News
News September 10, 2025
అయ్యప్ప మోకాళ్ల పట్టీ వెనకున్న కథ

అయ్యప్ప స్వామి చిన్ముద్రతోపాటు పట్టు బంధనంతో భక్తులకు దర్శనమిస్తారు. మహిషిని సంహరించిన తర్వాత స్వామి శబరిమల ఆలయంలో కొలువై ఉంటారు. పెంపుడు తండ్రి పందళరాజు తనను చూడటానికి వచ్చినప్పుడు, స్వామివారు లేవబోతారు. అప్పుడు రాజు ఆయనను యోగాసనంలోనే ఉండమని ప్రార్థిస్తూ, భుజాన ఉన్న పట్టువస్త్రాన్ని స్వామి మోకాళ్లకు కట్టి బంధిస్తారు. భక్తులందరికీ ఇదే రూపంలో దర్శనమివ్వాలని ప్రార్థించగా అయ్యప్ప అనుగ్రహించారు.
News September 10, 2025
నేపాల్ రాజ్యాంగాన్ని మార్చాలి: నిరసనకారులు

నేపాల్‌లో జెన్-Z యువత నిరసనలు కొనసాగిస్తోంది. తాజాగా వారి నుంచి మరిన్ని <<17651342>>డిమాండ్లు<<>> వినిపిస్తున్నాయి. రాజ్యాంగాన్ని మార్చాలని, దేశంలో 30 ఏళ్ల దోపిడీపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసనల్లో మరణించిన వారిని అమరవీరులుగా గుర్తించి, పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. దేశ భవిష్యత్తు కోసమే ఈ ఉద్యమమని చెబుతున్నారు. కొత్త రాజకీయ వ్యవస్థ వస్తేనే శాంతి స్థాపన జరుగుతుందని అంటున్నారు.
News September 10, 2025
Dy.CM ఫొటో ఏర్పాటుపై నిషేధం లేదు: హైకోర్టు

AP: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో Dy.CM ఫొటోల ఏర్పాటుపై ఎక్కడా నిషేధం లేదని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాల్లో Dy.CM పవన్ కళ్యాణ్ ఫొటో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగి వై.కొండలరావు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ రాజకీయ దురుద్దేశంతో వేసినట్లుగా ఉందని, అందుకే కొట్టివేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని సూచించింది.