News March 2, 2025
రైతులు క్వింటాకు ₹1000-2000 నష్టపోతున్నారు: హరీశ్ రావు

TG: రాష్ట్ర వ్యాప్తంగా సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ‘సన్ ఫ్లవర్ రైతుల కష్టాలు మీకు పట్టవా?’ అంటూ సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. ‘మద్దతు ధర రూ.7280 ఉంటే దళారులకు ₹5500-₹6,000కే విక్రయించాల్సిన దుస్థితి ఉంది. రైతులు క్వింటాకు ₹1000-2000 వరకు నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. నూనె పంటలు వేయాలంటేనే రైతులు భయపడుతున్నారు’ అని పేర్కొన్నారు.
Similar News
News March 27, 2025
చాకలి ఐలమ్మ వర్సిటీకి యూజీసీ గుర్తింపు

TG: చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి యూజీసీ గుర్తింపు లభించింది. దీంతో విద్యార్థినుల సర్టిఫికెట్స్‌పై అధికారికంగా వర్సిటీ ముద్ర పడనుంది. అంతే కాకుండా వర్సిటీలో PhD చేయాలనుకునే విద్యార్థులకు మార్గం సుగమమైంది. అధికారులు సైతం త్వరలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వవిద్యాలయ గుర్తింపు లేకపోవడంతో ఇంతకాలం ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్టిఫికెట్స్ వచ్చేవి.
News March 27, 2025
ఈ వీకెండ్ ఏ సినిమాకు వెళ్తున్నారు?

నేటి నుంచి ఈనెల 30 వరకు పలు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఇవాళ మోహన్‌లాల్ నటించిన ‘L2: ఎంపురాన్’ థియేటర్లలో సందడి చేయనుంది. రేపు ‘మ్యాడ్ స్క్వేర్’తో పాటు నితిన్-శ్రీలీల నటించిన ‘రాబిన్‌హుడ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈనెల 30న సల్మాన్ ఖాన్ నటించిన ‘సికందర్'(హిందీ) కూడా విడుదల కానుంది. మరి ఈ వీకెండ్ మీరు ఏ సినిమాకు వెళ్తున్నారు? కామెంట్ చేయండి.
News March 27, 2025
స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పెంపు

TG: SC, ST, BC, మైనారిటీ, EBC విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును మే 31 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. 11.88 లక్షల మంది విద్యార్థులకు గాను ఇప్పటివరకు 10.34 లక్షల మంది అప్లై చేసుకున్నారని తెలిపారు. MBBS, PG మెడికల్ ప్రవేశాలు పూర్తి కాకపోవడం, ఇంకా విద్యార్థుల వివరాలు అందకపోవడంతో గడువును పొడిగించారు. అటు కాలేజీల యాజమాన్యాల రిజిస్ట్రేషన్‌కూ మే 31 వరకు గడువు ఇచ్చారు.