News November 3, 2024

రైతులు క్వింటాకు ₹1000 నష్టపోతున్నారు: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే రోడ్డుపై ధర్నాలకు దిగుతామని హెచ్చరించారు. ‘క్వింటా వడ్లకు ₹2320 మద్దతు ధర, ₹500 బోనస్ కలిపి ₹2820 ఇవ్వాలి. కానీ రైతులు ₹1800కే అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో క్వింటాకు ₹1000 నష్టపోతున్నారు’ అని ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు.

Similar News

News December 3, 2025

స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు

image

AP: టీచర్ల కొరతను అధిగమించేందుకు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. గతంలో పని చేసిన విద్యా వాలంటీర్ల మాదిరే వీరు విధులు నిర్వర్తిస్తారు. ఇటీవల మెగా డీఎస్సీలో పోస్టులు భర్తీ చేసినా పలు స్కూళ్లలో ఇంకా ఖాళీలున్నాయి. మొత్తం 1,146 పోస్టుల్లో ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ఉత్తర్వులు విడుదలయ్యాయి. విధుల్లో చేరిన తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10వేలు ఇస్తారు.

News December 3, 2025

అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామక ప్రక్రియ ఇలా..

image

AP: మండలస్థాయిలో ఉన్న ఖాళీలపై MEO ప్రకటన చేయనుండగా, ఇవాళ్టి నుంచి 5వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లను MEO ఆఫీసుల్లో సమర్పించాలి. అకడమిక్(75%), ప్రొఫెషనల్(25%) అర్హతల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారవుతుంది. స్థానిక గ్రామాలు, మండలాల వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ నెల 7వ తేదీ‌లోగా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఫైనల్ అర్హుల జాబితాను ఖరారు చేస్తుంది. తర్వాతి రోజు నుంచే విధులకు హాజరవ్వాల్సి ఉంటుంది.

News December 3, 2025

PCOSతో దంత సమస్యలు

image

పీసీఓఎస్‌ సమస్య పెరిగినప్పుడు ‘పెరియోడాన్‌టైటిస్‌’ అనే చిగుళ్ల సమస్య కూడా వస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దంతాలు వదులవుతాయంటున్నారు. PCOS వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో చిగుళ్లలో రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి వైద్యులను సంప్రదిస్తే తగిన మందులతో పాటు ఆహారపుటలవాట్లలో కూడా మార్పులు-చేర్పులు సూచిస్తారని చెబుతున్నారు.