News November 3, 2024
రైతులు క్వింటాకు ₹1000 నష్టపోతున్నారు: హరీశ్ రావు
TG: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే రోడ్డుపై ధర్నాలకు దిగుతామని హెచ్చరించారు. ‘క్వింటా వడ్లకు ₹2320 మద్దతు ధర, ₹500 బోనస్ కలిపి ₹2820 ఇవ్వాలి. కానీ రైతులు ₹1800కే అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో క్వింటాకు ₹1000 నష్టపోతున్నారు’ అని ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు.
Similar News
News December 27, 2024
మన్మోహన్ ఫ్యామిలీ వివరాలు
మన్మోహన్ 1958లో గుర్‌శరన్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. ఈమె ప్రొఫెసర్, రచయిత. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉపీందర్, దమన్, అమృత్ సింగ్ ఉన్నారు. ఉపీందర్ అకోలా వర్సిటీ డీన్, హిస్టరీ ప్రొఫెసర్, ఢిల్లీ వర్సిటీలో హిస్టరీ HODగా పనిచేశారు. ఈమె 6 పుస్తకాలు రాశారు. దమన్ అనేక నవలలు రాశారు. NATGRID సీఈవోగా పనిచేశారు. అమృత్ ACLUలో స్టాఫ్ అటార్నీగా సేవలందిస్తున్నారు. మన్మోహన్ అల్లుళ్లు ఉన్నతస్థానాల్లో ఉన్నారు.
News December 27, 2024
మన్మోహన్ హోదాలు.. లెక్చరర్ టు ప్రధాని
✒ 1957-65 పంజాబ్ వర్సిటీ లెక్చరర్, ప్రొఫెసర్
✒ 1966-69 UNOలో వర్క్
✒ 1969-71 ఢిల్లీ వర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్
✒ 1972 కేంద్ర ఆర్థికశాఖ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్
✒ 1976 ఆర్థికశాఖ కార్యదర్శి
✒ 1982-85 RBI గవర్నర్
✒ 1985-87 ప్రణాళికా సంఘం VC
✒ 1991లో యూజీసీ చైర్మన్
✒ 1991-96 ఆర్థిక మంత్రి; ✒ 2004-14 దేశ ప్రధాని
News December 27, 2024
రాజ్యసభలో 33 ఏళ్లు
మన్మోహన్ సింగ్ 1991 నుంచి 2024 వరకు 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1991, 1995, 2001, 2007, 2013లో అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1998 నుంచి 2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. చివరగా 2019లో రాజస్థాన్ నుంచి పెద్దలకు సభకు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌తో ఆయన పదవీకాలం ముగిసింది. ఈయన 1999లో తొలిసారి దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.