News September 2, 2024

నిండా మునిగిన రైతన్న.. 4.10 లక్షల ఎకరాల్లో పంట నష్టం

image

AP: భారీ వర్షాలు, వరదలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 4.10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వరి, పత్తి, మిరప, మినుము, పెసర, కంది, మొక్కజొన్న తదితర పంటలు మునిగిపోయాయని అన్నదాతలు వాపోతున్నారు. వెంటనే సాయం అందించాలని కోరుతున్నారు. 20 జిల్లాల్లో వర్ష ప్రభావం ఉన్నప్పటికీ గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో తీవ్రత ఎక్కువగా ఉంది.

Similar News

News January 28, 2026

నేషనల్ ఫిజికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

image

న్యూఢిల్లీలోని CSIR-నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ 18 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఎస్సీ, డిప్లొమా అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 9 వరకు పంపాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.72,240 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nplindia.in

News January 28, 2026

విగ్రహమొక్కటే.. దేవుళ్లెందరో!

image

అనంతపురం(D) పంపనూరు సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం ఎంతో ప్రత్యేకమైనది. విజయనగర రాజగురువు వ్యాసరాజు ప్రతిష్టించిన ఇక్కడి విగ్రహం ఒకేచోట శివకుటుంబాన్ని, విష్ణుతత్వాన్ని ప్రదర్శిస్తుంది. విగ్రహంలో శివలింగం, శ్రీచక్రం, సప్తశిరస్సుల పాముతో పాటు గణపతి, నరసింహస్వామి కూడా ఉంటారు. ఇక్కడ 9/11 మంగళవారాలు ప్రదక్షిణలు చేస్తే నాగ, రాహుకేతు, కాలసర్ప దోషాలు తొలగి సంపద, సంతానం, వ్యాపార అభివృద్ధి కలుగుతుందని నమ్మకం.

News January 28, 2026

బ్లాక్ బాక్స్‌తో తెలియనున్న ప్రమాద కారణాలు!

image

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదానికి గల అసలు కారణాలు తెలియాలంటే బ్లాక్ బాక్స్ చెక్ చేయాల్సిందే. విమానం వేగం, ఇంధనం వంటి దాదాపు 80 రకాల సాంకేతిక అంశాలను ఇది రికార్డు చేస్తుంది. పైలట్ల మాటలు, కంట్రోల్ సెంటర్ నుంచి వచ్చిన సూచనలు, కాక్‌పిట్‌లో వినిపించే శబ్దాలను ఇది భద్రపరుస్తుంది. ప్రస్తుతం అధికారులు బ్లాక్ బాక్స్‌ను వెలికితీసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.