News August 21, 2024
వైసీపీ పాలనలో రైతులు నాశనం: మంత్రి ఆనం

AP: వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. మాజీ సీఎం జగన్కు ఇరిగేషన్పై అవగాహన లేదని మండిపడ్డారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. YCP పాలనలో రైతులు నాశనమయ్యారన్నారు. రెండేళ్ల క్రితం వరదలకు సోమశిల దెబ్బతిన్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం సోమశిలకు పూర్వవైభవం తీసుకొస్తుందని చెప్పారు.
Similar News
News September 19, 2025
విమానంపై పిడుగు పడితే ఏమవుతుందంటే?

వర్షాల సమయంలో ఎగురుతున్న విమానాలు కొన్నిసార్లు పిడుగుపాటుకు గురవుతుంటాయి. అయితే ఎన్ని పిడుగులు పడినా ఫ్లైట్ లోపల ఉన్నవారికి ఏమీ కాదు. ఎందుకంటే ప్రస్తుతం విమానాలను ఫెరడే కేజ్ అనే లేయర్తో తయారు చేస్తున్నారు. ఈ ప్రత్యేక లోహం ఫ్లైట్లోకి విద్యుదయస్కాంత క్షేత్రాలు వెళ్లకుండా నియంత్రిస్తుంది. పిడుగు పడగానే ఇవి ఈ లోహపు నిర్మాణం గుండా ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లిపోతాయి. దీని వల్ల ఎవరికీ ఏమీ కాదు.
News September 19, 2025
దసరా సెలవులు.. స్కూళ్లు, కాలేజీలకు హెచ్చరిక

TG: దసరా సెలవుల్లో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సెలవుల్లో రివిజన్ కోసం విద్యార్థులకు కొంత హోమ్ వర్క్ ఇవ్వాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు, జూ.కాలేజీలకు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉండనున్నాయి.
News September 19, 2025
పార్టీ ఫిరాయింపులు.. ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

TG: పార్టీ ఫిరాయింపులపై ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు పంపారు. తాము పార్టీ మారలేదని ఎమ్మెల్యేలు చెప్పగా, దానిపై సంతృప్తి చెందని స్పీకర్ మరిన్ని ఆధారాలు కావాలని కోరారు. త్వరలో ఎమ్మెల్యేల విచారణకు ట్రయల్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం. సంజయ్, పోచారం, యాదయ్య, వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిలకు ఈ నోటీసులు ఇచ్చారు.