News April 12, 2025
ప్రతి జిల్లాలో ఈ నెల రైతు మేళాలు: తుమ్మల

TG: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగుతున్న తెలంగాణ రైతు మహోత్సవానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. రైతు మేళాలో పలు స్టాళ్లను సందర్శించి పంట ఉత్పత్తులను పరిశీలించారు. ఈ నెలలో ప్రతి జిల్లాలో రైతు మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. నాణ్యమైన విత్తనాలు సాగు చేస్తేనే మంచి దిగుబడులు వస్తాయన్నారు. కాగా వనజీవి రామయ్య భౌతికకాయాన్ని మంత్రి సందర్శించనున్నారు.
Similar News
News January 6, 2026
‘రాజాసాబ్’ రన్ టైమ్ ఫిక్స్.. టికెట్ ధరలు పెరిగేనా?

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో రూపొందిన ‘రాజాసాబ్’ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా నిడివి 3 గంటల 9 నిమిషాలుగా పేర్కొంది. మరోవైపు సెన్సార్ సర్టిఫికెట్ రావడంతో టికెట్ ధరల పెంపునకు అనుమతివ్వాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు నిర్మాణ సంస్థ లేఖ రాసింది. దీనిపై <<18543073>>TG ప్రభుత్వం<<>> ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 9న మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.
News January 6, 2026
ECILలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

HYDలోని <
News January 6, 2026
ఈ చేప ఖరీదు రూ.28కోట్లు!

టోక్యోలోని టొయోసు మార్కెట్లో నిర్వహించిన వేలంలో ఒక బ్లూఫిన్ ట్యూనా చేప రికార్డు ధర పలికింది. 243kgs బరువున్న ఈ చేపను సుమారు రూ.28Crకు ($3.2M) ఓ రెస్టారెంట్ యజమాని దక్కించుకున్నారు. జపాన్లోని ‘Oma’ తీరంలో దొరికిన ఇలాంటి చేపలు రుచికరంగా ఉంటాయని పేరుంది. అలాగే అక్కడి సంప్రదాయం ప్రకారం న్యూఇయర్ తొలి వేలంలో అత్యధిక ధరకు చేపను కొంటే అదృష్టమని భావిస్తారు. అందుకే వ్యాపారులు ఎంత ఖర్చయినా వెనకాడరు.


