News August 9, 2024

CM రేవంత్ బెదిరిస్తున్నారని రైతుల ఆవేదన: BRS

image

TG: కొడంగల్‌లో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని CM రేవంత్, ఆయన సోదరుడు తమను బెదిరిస్తున్నారంటూ దౌల్తాబాద్ మండల రైతులు KTRను కలిశారు. దుద్యాల్ మండలంలో దాదాపు 3000 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వారు KTRకు వివరించినట్లు BRS ట్వీట్ చేసింది. భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని రైతులు చెప్పారని, వారికి అండగా ఉంటామని KTR హామీ ఇచ్చారని పేర్కొంది.

Similar News

News December 7, 2025

‘EU’ని రద్దు చేయాలి: ఎలాన్ మస్క్

image

యూరోపియన్ కమిషన్ ‘X’కు 140 మిలియన్ డాలర్ల <<18483215>>ఫైన్<<>> విధించడంపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. ‘యూరోపియన్ యూనియన్‌ను రద్దు చేయాలి. సార్వభౌమాధికారాన్ని దేశాలకు తిరిగి ఇవ్వాలి. తద్వారా ప్రభుత్వాలు తమ ప్రజలకు బాగా ప్రాతినిధ్యం వహించగలుగుతాయి’ అని పేర్కొన్నారు. ఈ కామెంట్స్‌ను ఓ యూజర్ షేర్ చేయగా.. ‘నా ఉద్దేశం అదే.. నేను తమాషా చేయట్లేదు’ అని పునరుద్ఘాటించారు.

News December 7, 2025

డిసెంబర్ 07: చరిత్రలో ఈ రోజు

image

1792: భారత్‌లో పోలీసు వ్యవస్థను ప్రవేశపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ
1896: తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు కన్నెగంటి సూర్యనారాయణమూర్తి జననం
1975: డైరెక్టర్ సురేందర్ రెడ్డి జననం
2013: హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం(ఫొటోలో) మరణం
*భారత సాయుధ దళాల పతాక దినోత్సవం
*అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం

News December 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.