News December 23, 2024
40 లక్షల మందికి రైతు భరోసా కట్!: BRS
TG: రైతు భరోసా పథకానికి పీఎం కిసాన్ నిబంధనలను వర్తింపజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలిచ్చిందని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ఒకవేళ ఈ నిబంధనలే అమలు చేస్తే దాదాపు 40 లక్షల మంది రైతులకు రైతు భరోసా కట్ అవుతుందని పేర్కొంది. తమ హయాంలో 70 లక్షల మందికి రైతు బంధు ఇచ్చామని, రైతు బంధు కంటే పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య 40 లక్షలు తక్కువని తెలిపింది.
Similar News
News December 23, 2024
800 మందికి ఓ వైద్యుడున్నాడు!
ఇండియాలో వైద్యుల సంఖ్య, వారికి ఎదురయ్యే సమస్యలపై ఓ వైద్యుడు చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ప్రస్తుతం ఆధునిక వైద్యం చదివిన వైద్యులు 13 లక్షలు, ఆయుష్ వైద్యులు దాదాపు 6 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం ప్రతి 800 మందికి ఒక వైద్యుడు ఉన్నారు. అయితే పని ఒత్తిడితో వైద్యులు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సామాన్యుల కంటే పదేళ్ల ముందే చనిపోతున్నారు. జూ.డాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’ అని Xలో రాసుకొచ్చారు.
News December 23, 2024
ఏపీలో వచ్చే నెల 8న ప్రధాని మోదీ పర్యటన
AP: ప్రధాని మోదీ వచ్చే నెల 8న అనకాపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
News December 23, 2024
4 రోజుల పని చాలు: NR మూర్తికి కాంగ్రెస్ MP కార్తీ కౌంటర్
నిజానికి దేశం వారానికి 4 రోజుల పనివిధానం వైపు వెళ్లాలని కాంగ్రెస్ MP కార్తీ చిదంబరం అన్నారు. MON 12PM నుంచి FRI 2PM వరకే ఉండాలన్నారు. నారాయణ మూర్తి 70Hrs పని, మాస్ మైగ్రేషన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘సుదీర్ఘంగా పనిచేయడం అర్థరహితం. సమర్థతపై దృష్టి సారించాలి. రోజువారీ జీవితం పోరాటం, అసమర్థత, నాణ్యతలేని మౌలిక వసతులతో గడిచిపోతోంది. సమాజంలో సామరస్యానికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ముఖ్యం’ అని పేర్కొన్నారు.