News July 19, 2024
ఏపీలోనూ రైతు రుణమాఫీ చేయాలి: షర్మిల

తెలంగాణలో రైతు రుణమాఫీ చేయడాన్ని APCC చీఫ్ షర్మిల స్వాగతించారు. ‘15 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే దఫాలో రుణమాఫీ చేసి అన్నదాత పట్ల ప్రేమ, వ్యవసాయం పట్ల నిబద్ధత చూపింది. మళ్లీ నిన్న తెలంగాణలోని రేవంత్ సర్కార్ ఇంకెప్పుడని వెక్కిరించిన నోళ్లు మూయించేలా రుణమాఫీ చేసింది. ఏపీలో ప్రతి రైతు తలపై సుమారు రూ.2,45,554 అప్పు ఉంది. ఏపీలోని కూటమి సర్కార్ కేంద్రం సాయంతో రుణమాఫీ చేయాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News November 22, 2025
నేడు భారీ సంఖ్యలో లొంగిపోనున్న మావోయిస్టులు

TG: మావోయిస్టు పార్టీకి మరో షాక్ తగిలింది. ఈ రోజు 37 మంది మావోయిస్టులు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోనున్నారు. అందులో కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులైన ఆజాద్, అప్పాసి నారాయణ, ఎర్రాలు తదితర ముఖ్య నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. మ.3 గంటలకు డీజీపీ మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించనున్నారు.
News November 22, 2025
బ్లడ్ గ్రూప్ డైట్ గురించి తెలుసా?

కొన్నిరకాల ఆహార పదార్థాలలో ‘లెక్టిన్లు’ అనే ప్రొటీన్లు ఉంటాయి. ఇవి బ్లడ్ గ్రూప్ యాంటి జెన్ను బట్టి రక్తంలో చేరి అనారోగ్యానికి కారణమవుతాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే బ్లడ్ గ్రూప్ను బట్టి ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. A: పండ్లు, కూరగాయలు, టోఫు, బీన్స్, చిక్కుళ్లు, తృణధాన్యాలు ఎక్కువగా, టమాట, వంకాయ, గోధుమలు, జొన్న, పాల ఉత్పత్తులు తక్కువగా తీసుకోవాలి.
News November 22, 2025
బ్లడ్ గ్రూప్ను బట్టి ఆహారం

B:మటన్, సముద్ర ఆహారం, వంకాయ, బీట్రూట్, పెరుగు, జున్ను, బాదం, ద్రాక్ష, బీన్స్ ఎక్కువగా, చికెన్, జొన్న, గోధుమ, టమాటా, పల్లీలు, నువ్వులు, చిక్కుళ్లు, సోయా తక్కువగా తీసుకోవాలి. AB: కెఫిన్, ఆల్కహాల్, వేపుళ్లు తక్కువగా, పాల ఉత్పత్తులు, టోఫు, సముద్ర ఆహారంపై ఎక్కువ దృష్టిపెట్టాలి. O: వీరు అధిక ప్రొటీన్ తీసుకోవాలి. గోధుమ పిండి, బీన్స్, సోయాబీన్ నూనెతో చేసిన ఆహారాలను తక్కువగా తీసుకోవాలి.


