News August 18, 2024

రుణమాఫీ కోసం రోడ్డెక్కిన రైతన్నలు

image

TG: 3వ విడతలోనూ తమకు రుణమాఫీ కాలేదని రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టి రహదారులపై రాకపోకలను అడ్డుకున్నారు. నిజామాబాద్, జగిత్యాల రైతులు నిరసనకు దిగారు. ADBలో CM దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు. కర్మకాండ కుండలతో మహారాష్ట్ర బ్యాంకులోకి వెళ్లి CM డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. KMNRలోని కొత్తపల్లి మండలంలో ఇండియన్ బ్యాంక్‌ను రైతులు మూసేశారు.

Similar News

News January 15, 2025

ఫిబ్రవరి నుంచి KF బీర్లు బంద్

image

వచ్చే నెల నుంచి తెలంగాణలో వైన్స్‌లు, బార్లలో KF బీర్లు లభించకపోవచ్చు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదంటూ ఆ బ్రాండ్ బీర్లు తయారుచేసే యునైటెడ్ బ్రూవరీ(UB) సంస్థ మద్యం సరఫరా నిలిపివేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న స్టాక్ ఈనెలాఖరు వరకే వస్తుందని దుకాణదారులు చెబుతున్నారు. ఆ తర్వాత వైన్స్ వద్ద కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో ఉండవు. మరోవైపు లిక్కర్ సరఫరాపై UB కంపెనీతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

News January 15, 2025

రేపు ఈడీ విచారణకు కేటీఆర్

image

TG: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ రేపు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉ.10.30 గంటలకు కేటీఆర్ హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌కు వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని అధికారులు విచారించారు. మరోవైపు తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్‌ను ఇవాళ సుప్రీం తోసిపుచ్చింది. దీంతో ఆయన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

News January 15, 2025

దేశంలో ఎన్నో స‌మ‌స్య‌లుంటే.. సైకిల్ ట్రాక్‌లు కావాలా?: సుప్రీంకోర్టు

image

‘దేశంలో పేద‌ల‌కు స‌రైన నివాస వ‌స‌తి లేదు. మురికివాడ‌ల్లో నివ‌సిస్తున్నారు. విద్యా, ఆరోగ్య సేవ‌ల కొర‌త ఉంది. ప్ర‌భుత్వాలు వీటి కోసం నిధులు ఖ‌ర్చు చేయాలా? లేక సైకిల్ ట్రాక్‌ల కోసమా?’ అని SC ప్ర‌శ్నించింది. దేశ‌ంలో సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటుకు ఆదేశాలివ్వాల‌న్న పిటిష‌న్ విచార‌ణలో కోర్టు ఈ వ్యాఖ్య‌లు చేసింది. పిటిషనర్ కాలుష్యం వంటి కారణాలు వివరించగా, ఇలాంటి ఆదేశాలు తామెలా ఇస్తామ‌ని SC ప్ర‌శ్నించింది.