News January 11, 2025

రైతు భరోసా ఎకరానికి రూ.17,500 ఇవ్వాల్సిందే: BRS

image

TG: రైతు భరోసా పథకంలో 70% మంది రైతులకు కోత పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో లీకులు ఇచ్చిందని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. తాము పోరాటం చేయడంతోనే ఇప్పుడు వెనక్కి తగ్గి సాగు భూములన్నింటికీ ఇస్తామంటోందని పేర్కొంది. ‘2023 యాసంగికి రూ.2,500, 2024 వానాకాలానికి రూ.7,500, 2024 యాసంగికి రూ.7,500 ప్రభుత్వం రైతులకు బాకీ పడింది. ఎకరానికి రూ.17,500 ఇచ్చే వరకూ రైతుల పక్షాన పోరాడతాం’ అని తెలిపింది.

Similar News

News January 24, 2026

ఎన్నికల ముంగిట మున్సిపాల్టీలకు ₹1000 కోట్లు

image

TG: మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం వాటిలో కనీస మౌలిక వసతులను మెరుగుపర్చేలా చర్యలు చేపట్టింది. వీటికోసం అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో TUIFDC ద్వారా చేపట్టే పనులకోసం ₹1000 కోట్ల నిధులను రుణం కింద తీసుకుంటోంది. హడ్కో నుంచి సేకరిస్తున్న ఈ రుణంతో పనులు ప్రారంభించనున్నారు. కాగా ఈ రుణాన్ని నెలవారీ వడ్డీతో వాయిదాల రూపంలో ప్రభుత్వం హడ్కోకు చెల్లించనుంది.

News January 24, 2026

ధరణి వల్లే భూభారతి స్కామ్: పొంగులేటి

image

TG: BRS ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌లో లొసుగులతోనే భూభారతి ద్వారా రిజిస్ట్రేషన్ డబ్బులు కొల్లగొట్టారని మంత్రి పొంగులేటి తెలిపారు. 9జిల్లాల్లో 48మందిపై క్రిమిన‌ల్ కేసులు నమోదు చేశామన్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి 4,848లావాదేవీల్లో లోటుపాట్లు జ‌రిగిన‌ట్లు గుర్తించామని అధికారులు మంత్రికి తెలిపారు. విచార‌ణలో 1,109డాక్యుమెంట్ల‌కు సంబంధించి రూ.4Cr చెల్లింపులు జరగనట్లు తేల్చామన్నారు.

News January 24, 2026

84 ఏళ్ల డైరెక్టర్‌తో 74 ఏళ్ల హీరో సినిమా

image

మలయాళ ఇండస్ట్రీలో అరుదైన కాంబోలో మూవీ తెరకెక్కనుంది. లెజెండరీ డైరెక్టర్ అదూర్ గోపాలకృష్ణన్ 84 ఏళ్ల వయసులో మళ్లీ దర్శకత్వం చేయనున్నారు. 74 ఏళ్ల మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించనున్నారు. 32 ఏళ్ల క్రితం ‘విధేయన్’ వంటి క్లాసిక్ తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. ‘పాదయాత్ర ’ పేరుతో ఈ కొత్త సినిమా తెరకెక్కనుంది. తెలుగులో మమ్ముట్టి ‘యాత్ర’లో నటించిన విషయం తెలిసిందే.