News May 24, 2024
విత్తనాల కొనుగోలులో రైతన్నలు జాగ్రత్త: TG పోలీసులు
TG: విత్తనాల కొనుగోలు విషయంలో రైతన్నలు అప్రమత్తతతో, అవగాహనతో వ్యవహరించాలని రాష్ట్ర పోలీసులు తాజాగా సూచించారు. విత్తనాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాకే కొనాలని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలను విక్రయించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఒకవేళ విత్తనాల విషయంలో ఏదైనా సందేహం వస్తే వెంటనే తమను సంప్రదించాలని ట్విటర్లో స్పష్టం చేశారు.
Similar News
News January 16, 2025
కేటీఆర్ విచారణ.. ఈడీ ఆఫీస్ వద్ద హైడ్రామా
TG: ఈడీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. కేటీఆర్ విచారణ ముగిసిందని తెలిసి బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. అక్కడే ఉంటామని పలువురు కార్యకర్తలు తెగేసి చెప్పడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో కేటీఆర్ బయటికి వస్తారా? లేదా? అని ఉత్కంఠ నెలకొంది.
News January 16, 2025
ముగిసిన కేటీఆర్ విచారణ
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటలపాటు అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
News January 16, 2025
87 మంది పిల్లలకు తండ్రి.. NEXT టార్గెట్ ప్రతి దేశంలో ఓ బిడ్డ
USకు చెందిన కైల్ గోర్డీ ప్రపంచ ప్రఖ్యాత స్పెర్మ్ డోనర్. bepregnantnow వెబ్సైట్ ద్వారా ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ దేశాల్లో 87 మంది పిల్లలకు తండ్రయ్యారు. ఈ ఏడాదిలో ఆ సంఖ్య 100కు చేరనుంది. 2026 నాటికి ప్రతి దేశంలో ఓ పిల్లాడికి తండ్రవ్వడమే లక్ష్యమని ఆయన చెబుతున్నారు. గర్భధారణ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి సాయం చేయడం సంతోషంగా ఉందంటున్నారు.