News December 20, 2024
ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు రావొద్దు: CM
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734684951906_653-normal-WIFI.webp)
AP: ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని CM చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తేమ, ఇతర అంశాల్లో కచ్చితత్వం ఉండాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని, తానే స్వయంగా ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరిస్తానని చెప్పారు. అన్నదాతలకు సేవ చేసే విషయంలో తప్పు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు.
Similar News
News February 5, 2025
ChatGPT, డీప్‌సీక్‌పై నిషేధం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738749597716_1199-normal-WIFI.webp)
రహస్య సమాచారం, పత్రాలు లీకయ్యే ప్రమాదం ఉండటంతో ఛాట్‌జీపీటీ, డీప్‌సీక్ వంటి అన్ని రకాల AI టూల్స్ వాడకాన్ని ఫైనాన్స్ మినిస్ట్రీ నిషేధించింది. సంబంధిత ఆదేశాలను ఆ శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఆమోదించారు. ఆర్థిక వ్యవహారాలు, ఎక్స్పెండీచర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, దీపమ్, ఆర్థిక సేవల శాఖలకు లేఖలు పంపించారు. జనవరి 29న, కేంద్ర బడ్జెట్‌కు ముందు ఆదేశాలు ఇవ్వగా ఇప్పటికీ అమలు కొనసాగుతోంది.
News February 5, 2025
TTDలో అన్యమత ఉద్యోగులు బదిలీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738749343287_367-normal-WIFI.webp)
AP: టీటీడీలో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి. హిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూనే టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై టీటీడీ క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది. ఇకపై వీరిని టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపుల్లో విధులకు నియమించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 18 మందిని వెంటనే బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
News February 5, 2025
ఏపీ అసెంబ్లీకి లోక్‌సభ స్పీకర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738749102239_782-normal-WIFI.webp)
AP: అసెంబ్లీలో ఈ నెల 22 నుంచి రెండు రోజుల పాటు MLA, MLCలకు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఓరియంటేషన్ క్లాసులను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించనుండగా, ఒక సెషన్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడనున్నారు. ఈ క్లాసుల తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.