News August 21, 2025
కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు మొదలు: జగదీశ్ రెడ్డి

TG: కాంగ్రెస్ పాలనలో రైతులకు <<17461451>>కష్టాలు<<>> మొదలయ్యాయని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. యూరియా కోసం రోడ్లెక్కి, అధికారుల కాళ్లు మొక్కే పరిస్థితి వచ్చిందన్నారు. ఢిల్లీ కాళ్లు మొక్కి టికెట్లు తెచ్చుకునే నేతలు, ప్రజలకు అదే అలవాటు చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కొందరు మంత్రులు, దళారులు కుమ్మక్కై రైతులకు ఈ దుస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News August 21, 2025
217 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం

TG: CCLAలో 217 పోస్టులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15 కొత్త రెవెన్యూ మండలాల్లో 189 పోస్టులు, రెండు డివిజన్ల కోసం 28 పోస్టులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ, గద్వాల జిల్లాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
News August 21, 2025
KTRను సొంత చెల్లే వ్యతిరేకిస్తోంది: సీతక్క

TG: ‘థర్డ్ క్లాస్ పార్టీ’ అన్న <<17464123>>KTR<<>> కామెంట్స్‌పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ‘KTR ఇంట్లో పంచాయితీ తట్టుకోలేక డైవర్ట్ చేయడానికి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. సొంత చెల్లే వ్యతిరేకించడంతో మైండ్ కరాబైంది’ అని ఎద్దేవా చేశారు. ‘BRS బండారం SEP 9న బయట పడుతుంది. BJPతో దోస్తీ ఉందో లేదో తేలిపోతుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగుబిడ్డకు మద్దతుగా నిలబడతావా, లేదా?’ అని KTRని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
News August 21, 2025
సాయంత్రం ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి బయల్దేరనున్నారు. రేపు మ.2 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన భేటీ అవుతారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆమెకు వివరించి ఆర్థిక సాయం కోరనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఎకనమిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు సీఎం హాజరవుతారు. రాత్రి అమరావతికి తిరుగు పయనమవుతారు.