News August 23, 2025

రైతుల యూరియా కష్టాలు వర్ణనాతీతం: షర్మిల

image

AP: రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల వాపోయారు. తెల్లవారుజాము నుంచే ఎరువుల కేంద్రాల వద్ద రైతులు కి.మీ. మేర క్యూలు కడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో రైతు సేవా, మార్క్ ఫెడ్, సొసైటీ కేంద్రాల దగ్గర యూరియా నో స్టాక్ బోర్డులు పెట్టడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. ఇది నిజంగా కొరతనా, లేక అధికార పార్టీ నేతలు సృష్టిస్తున్న కృత్రిమ కొరతనా అని నిలదీశారు.

Similar News

News August 23, 2025

ఐబీలో 394 జాబ్స్.. జీతం రూ.81వేలు

image

394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు ఇంటెలిజెన్స్ బ్యూరో నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అప్లికేషన్లకు సెప్టెంబర్ 14 వరకు అవకాశం కల్పించింది. డిగ్రీ పూర్తి చేసి, 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. ఎంపికైన వారికి జీతం రూ.25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. SHARE IT.

News August 23, 2025

యూరియా కొరతపై BRS,BJP డ్రామాలు: రేవంత్

image

TG: యూరియా కొరతపై సీఎం రేవంత్ రెడ్డి PAC సమావేశంలో స్పందించారు. ‘బీఆర్ఎస్, బీజేపీ కలిసి యూరియా కొరతపై డ్రామాలు ఆడుతున్నాయి. యూరియా ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని KTR అనడంలోనే వాళ్ల తీరు అర్థమవుతోంది. యూరియా కోసం నాలుగుసార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్‌ను కలిశాను. యూరియా పంపిణీపై క్షేత్రస్థాయిలో మానిటరింగ్‌ పెంచాలి’ అని తెలిపారు.

News August 23, 2025

రేపటి నుంచి ఆల్ ఇండియా స్పీకర్ల కాన్ఫరెన్స్

image

ఢిల్లీ అసెంబ్లీ భవనంలో ఆది, సోమవారాల్లో ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ 2 రోజుల సదస్సును హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. సోమవారం ముగింపు కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో తెలుగు రాష్ట్రాల సభాపతులతో పాటు మరో 30 మంది స్పీకర్లు పాల్గొననున్నారు.