News August 1, 2024
రుణమాఫీ కాని రైతులు ఈ నంబర్‌కు ఫోన్ చేయండి: కిషన్ రెడ్డి

TG: రుణమాఫీని పూర్తిగా ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని BJP రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అన్నదాతల కోసం పార్టీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రుణమాఫీ కాని, ఇతర సమస్యలున్న వారు HelpLine 8886100097కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. రుణమాఫీ జరగక రైతులు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మారుతున్నారని ఆరోపించారు.
Similar News
News November 16, 2025
మూడో రోజే ముగిస్తారా?

ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజే ముగిసేలా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో రెండు జట్లు 200 లోపు స్కోర్లకే ఆలౌట్ అయ్యాయి. రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడిన సౌతాఫ్రికా 93 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం కేవలం 63 పరుగుల లీడ్‌లో ఉంది. భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో మిగతా 3 వికెట్లు ఫస్ట్ సెషన్లోనే పడిపోయే ఛాన్స్ ఉంది.
News November 16, 2025
కార్తీక మాసంలో ఇవి ఆచరించలేదా?

కార్తీక మాసంలో దీపారాధన, దీపదానం చేస్తారు. అయితే తులసి చుట్టూ ప్రదక్షిణలు, ఉసిరి చెట్టు పూజ, దాని కింద వనభోజనం, శివుడితో పాటు కేశవుడి కథలు కూడా వినడం, దానధర్మాల్లో పాల్గొనడం.. వంటివి కూడా చేయాలని పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇవి చేయకపోతే.. రేపు కార్తీక మాస చివరి సోమవారం రోజున ఆచరించవచ్చని సూచిస్తున్నారు. ఫలితంగా శివకేశవుల సంపూర్ణ అనుగ్రహంతో సకల పాపాలు తొలగి, శుభాలు కలుగుతాయని నమ్మకం.
News November 16, 2025
అరుదైన రికార్డు.. దిగ్గజాల జాబితాలో జడేజా

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు నెలకొల్పారు. టెస్టుల్లో 4 వేల పరుగులు, 300 వికెట్ల ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచారు. ఈ జాబితాలో కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, డానియెల్ వెటోరీ వంటి దిగ్గజాలు ఉండటం గమనార్హం. జడేజా నిన్న బ్యాటింగ్‌లో 27 పరుగులు చేసి, 4 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం అతడి ఖాతాలో 4017 రన్స్, 342 వికెట్స్ ఉన్నాయి.


