News April 21, 2024

అకాల వర్షాలు.. ఆందోళనలో రైతులు

image

TG: వేసవికాలంలో అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పంట చేతికొచ్చిన సమయానికి వడగండ్ల వానలతో పలు చోట్ల తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వరితో పాటు మొక్కజొన్న, మామిడి ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. నష్టపోయిన వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Similar News

News February 2, 2026

గోధుమ పిండి దీపంతో వివాదాల పరిష్కారం

image

అనుకోని వివాదాలు, కోర్టు సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు గోధుమ పిండితో చేసిన దీపం వెలిగించడం శ్రేయస్కరం. ఈ దీపారాధన వల్ల శత్రు చికాకులు తొలగిపోతాయి. జాతకంలో సూర్య గ్రహ దోషాలు ఉన్నా, అధికారులతో ఇబ్బందులు ఎదురైనా గోధుమ పిండి దీపం ఉపశమనాన్ని ఇస్తుంది. మనశ్శాంతిని ప్రసాదించి, క్లిష్ట పరిస్థితుల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. సమస్యల తీవ్రత తగ్గాలనుకునే వారు ఈ దీపాన్ని క్రమం తప్పకుండా వెలిగించాలి.

News February 2, 2026

జార్జియాలో ‘వారణాసి’ షూటింగ్!

image

రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు, ప్రియాంకా చోప్రా జంటగా రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ జార్జియాలో మొదలుకానున్నట్లు తెలుస్తోంది. డెరెక్టర్ రాజమౌళి దీనికి సంబంధించి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారట. అలాగే మరో కీలక షెడ్యూల్‌ను అంటార్కిటికాలో చిత్రీకరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.

News February 2, 2026

పెసరపిండి దీపం ఎందుకు వెలిగించాలంటే..?

image

ఇంట్లో దారిద్ర్యం తొలగి, లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే పెసరపిండి దీపం వెలిగించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు ఈ దీపారాధన చేయడం వల్ల సుఖశాంతులు చేకూరుతాయి. పెసరపిండి దీపం బుధ గ్రహానికి ప్రీతికరమైనది, కాబట్టి ఇది వ్యాపార అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. నిత్యం పేదరికం వేధిస్తున్నా, సంపాదన నిలకడగా లేకపోయినా ఈ దీపాన్ని వెలిగిస్తే అద్భుతమైన మార్పులు కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు.