News February 17, 2025
ఫాస్టాగ్: నేటి నుంచి కొత్త రూల్స్.. లేటైతే రెట్టింపు బాదుడు

ఇవాళ్టి నుంచి ఫాస్టాగ్ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. బ్లాక్‌లిస్టు, ఇన్‌యాక్టివ్‌లో ఉన్న FASTag యూజర్లు టోల్ గేటుకు వచ్చే 70ని.ల్లోపు ఆ జాబితా నుంచి బయటకు రావాలి. లేదంటే డబుల్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ లేకపోవడం, KYC పెండింగ్, ఛాసిస్, వెహికల్ నంబర్లు వేర్వేరుగా ఉంటే ఆ ఖాతా బ్లాక్‌లిస్టులోకి వెళ్తుంది. కాబట్టి ముందుగానే రీఛార్జ్, KYCని కంప్లీట్ చేసుకోవడం బెటర్.
Similar News
News September 19, 2025
పార్టీ ఫిరాయింపులు.. ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

TG: పార్టీ ఫిరాయింపులపై ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు పంపారు. తాము పార్టీ మారలేదని ఎమ్మెల్యేలు చెప్పగా, దానిపై సంతృప్తి చెందని స్పీకర్ మరిన్ని ఆధారాలు కావాలని కోరారు. త్వరలో ఎమ్మెల్యేల విచారణకు ట్రయల్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం. సంజయ్, పోచారం, యాదయ్య, వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిలకు ఈ నోటీసులు ఇచ్చారు.
News September 19, 2025
దసరా స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంపు!

TG: దసరా <<17751389>>స్పెషల్ బస్సుల్లో<<>> సవరించిన ఛార్జీలు అమల్లో ఉంటాయని RTC ప్రకటించింది. దీంతో టికెట్ ధర 50% పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 20, 27-30, అక్టోబర్ 1, 5, 6 తేదీల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో ఈ సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయి. రెగ్యులర్ సర్వీసుల ఛార్జీల్లో మార్పు ఉండదని సంస్థ తెలిపింది. 2003లో ప్రభుత్వం జారీ చేసిన GO 16 ప్రకారం స్పెషల్ బస్సులకు ఛార్జీలు సవరిస్తున్నట్లు RTC గతంలో పలుమార్లు వివరణ ఇచ్చింది.
News September 19, 2025
ఈనెల 22 నుంచి డిగ్రీ కాలేజీలు బంద్

AP: రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఈనెల 22 నుంచి కాలేజీలు మూసేస్తామంటూ ప్రభుత్వానికి సమ్మె నోటీసులిచ్చాయి. 16నెలలుగా ఫీజు బకాయిలు పెట్టడంతో ఉద్యోగులకు జీతాలివ్వలేక, కళాశాలలు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. తొలుత రెండు యూనియన్లు బంద్ నిర్ణయం తీసుకోగా.. దసరా సెలవుల నేపథ్యంలో ఓ యూనియన్ నిర్ణయాన్ని వాయిదా వేసింది.