News April 2, 2024
IPL2024లో ఫాస్టెస్ట్ బాల్!

RRతో వాంఖడేలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పేసర్ గెరాల్డ్ కోయెట్జీ 157.4 KMPH వేగంతో బౌలింగ్ చేసి ఆశ్చర్యపరిచారు. ఇది IPL 2024లో అత్యంత వేగవంతమైన డెలివరీగా రికార్డులకెక్కింది. IPL చరిత్రలో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన రికార్డు ఆస్ట్రేలియన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాన్ టైట్ ( 2011లో 157.71kmph) పేరిట ఉండగా.. గెరాల్డ్ రెండో స్థానంలో నిలిచారు.
Similar News
News October 15, 2025
బ్రహ్మకు ఒక పగలు.. మనకు ఎంతంటే?

వేంకటాచల మాహాత్మ్యం ప్రకారం.. ప్రస్తుతం ఉన్న కలియుగం 4,32,000 సంవత్సరాలు. ద్వాపరయుగం దీనికి రెండింతలు. అంటే 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగం మూడింతలు. అంటే 12,96,000 సంవత్సరాలు. ఇక ధర్మప్రధానమైన కృతయుగం నాలుగు రెట్లు. అంటే 17,28,000 సంవత్సరాలు. ఈ నాలుగు యుగాలు కలిస్తే ఓ మహాయుగం. ఇలాంటి వెయ్యి మహాయుగాలు బ్రహ్మదేవునికి ఓ పగలు అవుతుంది. మరో వెయ్యి మహాయుగాలు ఒక రాత్రి అవుతుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News October 15, 2025
ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: రెండ్రోజుల్లో దేశం నుంచి నైరుతి రుతుపవనాలు కనుమరుగయ్యే ఛాన్సుందని IMD పేర్కొంది. ఇప్పటికే ఒడిశా, ఛత్తీస్గఢ్, ఈశాన్య రాష్ట్రాల నుంచి నిష్క్రమించినట్లు తెలిపింది. ఇదే టైమ్లో ఈశాన్య రుతుపవనాలు సౌత్ ఇండియాలోకి ప్రవేశిస్తాయంది. ఉపరితల ఆవర్తనాలతో పలు జిల్లాల్లో రాబోయే మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. నేడు TPT, NLR, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది.
News October 15, 2025
1289 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ విభాగంలో 1,289 హెడ్కానిస్టేబుల్, కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే లాస్ట్ డేట్. ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, PE, MT/ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష డిసెంబర్, 2025/జనవరి, 2026లో నిర్వహించనున్నారు. వెబ్సైట్: https://ssc.gov.in/