News March 21, 2024
ప్రతి సోమవారం ఉపవాసం ఉంటా: సీజేఐ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘నేను నా భార్య పూర్తి శాకాహారులం. మా జీవనశైలి మొక్కల ఆధారితం. మనం తీసుకునే ఆహారం మెదడుపై ప్రభావం చూపుతుందని మేము నమ్ముతాం. అలాగే 25 ఏళ్లుగా ప్రతి సోమవారం నేను ఉపవాసం ఉంటున్నా. రోజూ ఉదయం 3.30 గంటల సమయంలో యోగా చేస్తా. నాకు ఐస్క్రీమ్ అంటే ఇష్టం’ అని సీజేఐ చెప్పారు.
Similar News
News April 9, 2025
ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు తప్పదు: WHO

ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు తప్పదని WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కానీ ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేమని, ఎప్పుడైనా సంభవించవచ్చని చెప్పారు. దీనికి 20 ఏళ్లు పట్టొచ్చు లేదా రేపే జరగొచ్చని అభిప్రాయపడ్డారు. మహమ్మారి ముప్పు మాత్రం ఖాయమని, అది జరిగి తీరుతుందని నొక్కి చెప్పారు. దీనికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.
News April 9, 2025
గ్యాస్ ధరల పెంపు.. వారిపై నో ఎఫెక్ట్

TG: కేంద్రం వంట గ్యాస్ ధరల పెంపు నిర్ణయం మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు వర్తించదు. ధరలు పెరిగినా రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే సిలిండర్ ఇస్తానని ప్రకటించడమే దీనికి కారణం. దీంతో ఈ పెంపు ఎఫెక్ట్ మిగిలిన LPG గ్యాస్ వినియోగదారులపై పడనుంది. రాష్ట్రంలో 90 లక్షలకు పైగా కుటుంబాలపై అదనపు భారం పడనుండగా 39 లక్షల మహాలక్ష్మి లబ్ధిదారులకు ఉపశమనం లభిస్తుంది. రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి ధర రూ.905-రూ.928.50కి చేరింది.
News April 8, 2025
అక్రమ వలసదారులకు రోజుకు రూ.86వేల జరిమానా?

USAలో అక్రమ వలసదారులు ‘ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ’ నుంచి ఆదేశాలు అందుకున్న తర్వాత కూడా దేశం నుంచి వెళ్లకుంటే, రోజుకు 998 డాలర్లు జరిమానా విధించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.86వేలు. సెల్ఫ్ డిపోర్టేషన్ చేయకుండా అక్రమ వలసదారులు పట్టుబడితే డబ్బు స్వాధీనం చేసుకోవడంతో పాటు దేశంలోకి రాకుండా శాశ్వత బహిష్కరణకు DHS ఆదేశించింది.