News October 2, 2024
ఉపవాసం అందరికీ మంచిది కాదు: వైద్యులు

లంకణం దివ్యౌషధం అన్నారు పెద్దలు. అయితే అది అందరికీ వర్తించదంటున్నారు వైద్యులు. థైరాయిడ్ సమస్యలున్నవారు, నెలసరి సక్రమంగా రానివారు, సంతాన సాఫల్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు, శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉండేవారు, మధుమేహం ఉన్నవారు ఉపవాసాలకు దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు. ఉన్న సమస్య పరిష్కారం కోసం ఉపవాసం చేస్తే వీరు లేని సమస్యలు తెచ్చుకునే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Similar News
News January 18, 2026
NASA ఆఫర్.. మూడ్రోజులే ఛాన్స్

చంద్రుడిని చుట్టి వచ్చేందుకు NASA <<18861755>>ఆర్టెమిస్-2<<>> టెస్ట్ ఫ్లైట్ మిషన్ చేపట్టింది. ఇందులో ప్రజలను భాగం చేసేందుకు ‘సెండ్ యువర్ నేమ్’ క్యాంపైన్ రన్ చేస్తోంది. రిజిస్టర్ చేసుకున్న వారి పేర్లను SD కార్డ్లో వేసి ఆస్ట్రోనాట్స్తో పాటు పంపుతారు. 10 రోజులపాటు మీ పేరు చంద్రుడిని చుట్టొస్తుంది. వారి పేరుతో బోర్డింగ్ పాస్ కూడా ఇస్తున్నారు. JAN 21తో ఈ క్యాంపైన్ ముగుస్తుంది. రిజిస్టర్ చేసుకునేందుకు <
News January 18, 2026
ఆలు లేత, నారు ముదర అవ్వాలి

ఈ సామెతలో ఆలు అంటే తమలపాకు. అది ఎంత లేతగా ఉంటే అంత రుచిగా, మృదువుగా ఉంటుంది. అలాగే మనిషి కూడా కొన్ని(స్వభావం, మాటతీరు) విషయాల్లో మృదువుగా, సున్నితంగా ఉండాలి. ఇక్కడ నారు అంటే వరి నారు, మొక్కల నారు. అది నాటే సమయానికి ముదరగా ఉంటేనే మంచి పంట వస్తుంది. అలాగే మనిషి కూడా కొన్ని విషయాల్లో (విలువలు, నిర్ణయాలు, పట్టుదల) దృఢంగా, స్థిరంగా ఉంటే మంచిదని ఈ సామెత అర్థం.
News January 18, 2026
కాలసర్ప దోష విముక్తికై నేడు ఇలా..

జాతకంలో రాహు-కేతువుల ప్రభావంతో ఏర్పడే కాలసర్ప దోషం వల్ల పనులు మధ్యలో ఆగిపోవడం, నిరాశ వంటివి ఎదురవుతాయి. చొల్లంగి అమావాస్య పర్వదినం దీనికి సరైన పరిష్కార సమయం. ఓ వెండి నాగుపాము ప్రతిమకు భక్తితో పూజ నిర్వహించి, దానిని ప్రవహించే నదిలో లేదా సముద్ర సంగమ జలాల్లో నిమజ్జనం చేయాలి. ఈ పవిత్ర రోజున ఇలా చేయడం వల్ల సర్వ దోషాలు తొలగి, జీవితంలో ఆటంకాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు.


