News April 11, 2024
నా 14ఏళ్ల నుంచి ఉపవాసం ఉంటున్నా: నోరా

తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం మాత్రం మానేయనని బాలీవుడ్ నటి నోరా ఫతేహీ అన్నారు. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారని, ఆ పాపాలను కడుక్కోవడానికే దేవుణ్ని ప్రార్థిస్తుంటారని ఆమె పేర్కొన్నారు. ‘నా 14ఏళ్ల నుంచి నేను రంజాన్ ఉపవాసం ఉంటున్నా. అది నాలో చొచ్చుకుపోయింది’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Similar News
News February 7, 2026
కరీంపేట: పొలంలోనే గుండెపోటుతో రైతు మృతి

శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన రైతు బొజ్జ సమ్మయ్య(53) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. మృతుడు తన వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మరో రైతు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన పొలానికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే సమ్మయ్య ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.
News February 7, 2026
ఉన్న వాటినే కాపాడుకోలేరు.. పాక్‌పై J&K సీఎం సెటైర్లు

కశ్మీర్ తమ దేశంలో <<19062687>>అంతర్భాగమవుతుందని<<>> పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రశ్నించగా జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘మేం వారిలో భాగమవుతామా? వాళ్ల దగ్గర ఉన్న వాటినే సరిగ్గా చూసుకోలేరు. ఇక మాతో ఏం చేస్తారు?’ అంటూ సెటైర్లు వేశారు.
News February 7, 2026
ఈ చిచ్చరపిడుగును WC జట్టులోకి తీసుకోవాల్సిందేనా?

వైభవ్ సూర్యవంశీ. వయసు 14 ఏళ్లు. ఆడుతోంది వరల్డ్ కప్ ఫైనల్. అయితే ఏంటి? 15 సిక్సర్లు, 15 ఫోర్లతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. కేవలం 80 బంతుల్లోనే 175 రన్స్ చేశారు. వైభవ్ ఇంకొన్ని ఓవర్లు క్రీజులో ఉండి ఉంటే భారత్ స్కోర్ ఈజీగా 500 దాటేది. దీంతో ఈ పిల్లాడిని త్వరగా టీమ్ ఇండియాలోకి తీసుకోవాలని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. వీలైతే T20 WC జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. COMMENT?


