News August 11, 2024

ఘోర ప్రమాదం

image

TG: మేడ్చల్ జిల్లా గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మరణించారు. రాఘవేంద్రనగర్‌కు చెందిన రైల్వే లైన్‌మెన్ కృష్ణ తన ఇద్దరు కూతుళ్లను ట్రాక్‌పై కూర్చోబెట్టి పనిచేస్తున్నాడు. దూసుకొచ్చిన రైలు ముగ్గురినీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 1, 2025

NITCON లిమిటెడ్‌ 143 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

NITCON లిమిటెడ్‌ 143 డేటా ఎంట్రీ ఆపరేటర్(DEO), MTS పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హత గల అభ్యర్థులు నవంబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. DEO పోస్టులకు స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, MTS పోస్టులకు షార్ట్ లిస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitcon.org/

News November 1, 2025

శనివారం రోజున చేయకూడని పనులు

image

శనివారం నాడు కొన్ని వస్తువులను ఇంటికి తీసుకెళ్లడం, కొన్ని పనులు చేయడం అశుభమని భావిస్తారు. అవి..
☞ శనివారం నాడు నువ్వుల నూనె, తోటకూర, చెప్పులు కొనుగోలు చేయకూడదు.
☞ ఉప్పు, నల్ల మినుములను (నల్ల మినప్పప్పు) ఇంటికి తీసుకురావడం శుభదాయకం కాదు.
☞ శనివారం బొగ్గులు, ఇనుము కూడా కొనకపోవడం ఉత్తమం.
☞ ఈ నియమాలు పాటిస్తే శని దేవుని ఆగ్రహం తగ్గుతుందని, అదృష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

News November 1, 2025

పోలవరం నిర్వాసితులకు ₹1,000 కోట్ల పరిహారం.. నేడే పంపిణీ

image

AP: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పునరావాసం కింద మరో రూ.వెయ్యి కోట్లను వారికి చెల్లించనుంది. నేడు ఏలూరు జిల్లా వేలేరుపాడులో జరిగే కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు వారికి చెక్కులను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా తెరిచిన ఖాతా నుంచి లబ్ధిదారులకు సొమ్ము జమ కానుంది. ఈ ఏడాది జనవరిలో కూడా ప్రభుత్వం రూ.900 కోట్లను నిర్వాసితులకు విడుదల చేసింది.